ఫస్టాఫ్ ఎలా ఉన్నా.. సెకండాఫ్ బాగుంటేనే.. సినిమా ఆడుతుంది. 2019 మొదటి ఆరునెలల్లో టాలీవుడ్ పర్సంటేజ్ బాగున్నా.. సెకండాఫ్ వచ్చేసరికి సక్సెస్ రావడం కష్టమైపోయింది. డిసెంబర్ నెల కూడా ఇలానే గడిచింది. ఒక సినిమా ప్రాఫిట్ లోకి ఎంట్రీ అయితే మరో సినిమా బోర్డర్ కు దగ్గర్లో ఉంది. మిగతావన్నీ ఫ్లాపులే. 

 

క్యాలెండర్ నెలలు మారుతున్నా.. రిజల్ట్ మాత్రం మారడం లేదు. ఈ నెలలో సినిమాలు ఇబ్బడిముబ్బడిగా రిలీజ్ అయ్యాయి. శుక్రవారం వస్తే చాలు.. నాలుగైదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. డిసెంబర్ మొదటి శుక్రవారం మూడు సినిమాలు వస్తే.. ఒక్కటీ మెప్పించలేదు. ఆర్ ఎక్స్ 100 తర్వాత హిట్ లేని కార్తికేయ 90ఎంఎల్ తో కిక్ ఎక్కిద్దామనుకుంటే.. ప్రేక్షకులకు మాత్రం ఎక్కలేదు. 

 

ప్రేమలో కొత్త దనం చూపించాలనుకున్న మిస్ మ్యాచ్  బాక్సాఫీస్ వద్ద మ్యాచ్ కాలేదు. కమెడియన్ శ్రీనివాసరెడ్డి దర్శక నిర్మాతగా మారి తీసిన భాగ్యనగర వీధుల్లో మ్యాజిక్ చేయలేకపోయింది. వివాదాలు దాటుకొని రిలీజైన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు డిజాస్టర్ టాక్ తో కనిపించకుండా పోయింది. రామ్ గోపాల్ వర్మ మూవీ అంటే.. హైప్.. కాంట్రవర్సీ తప్ప మరొకటి ఉండదని అమ్మరాజ్యంలో కడప బిడ్డలు మరోసారి రుజువయింది. 


ఈ నెలలో ఇద్దరు సీనియర్ హీరోలు అదృష్టం పరీక్షించుకుంటే.. ఒకరు మాత్రమే ఓకే అనిపించుకున్నారు. బాలకృష్ణ రూలర్ గా ఎంట్రీ ఇచ్చాడు. 80వ దశకం లాంటి మూస కథ కావడంతో.. రూలర్స్ ను ఆడియన్స్ పట్టించుకోలేదు. పెట్టుబడిలో 50పర్సెంట్ మాత్రమే రాబట్టింది. 


ఈ ఏడాది మొదట్లో సంక్రాంతికి ఎఫ్ 2తో బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకటేశ్.. ఇయర్ ఎండింగ్ లో వెంకీమామగా వచ్చాడు. సినిమా  డివైడ్ టాక్ వచ్చినా.. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమా కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాగా.. మరికొన్ని చోట్ల బోర్డర్ లో ఉంది. 

 

స్ట్రైట్ మూవీస్ కే కాదు.. డబ్బింగ్ సినిమాలకు డిసెంబర్ కలిసి రాలేదు. మమ్ముట్టి నటించిన బిగ్ బడ్జెట్ మూవీ మమాంగం వచ్చిన సంగతే తెలియకుండా పోయింది. కార్తీ నటించిన దొంగకు మంచి టాక్ వచ్చినా.. ప్రతి రోజు పండగే సందడి ముందు తట్టుకోలేకపోయింది. ఇక సల్మాన్ దబంగ్ 3 అనువాదం తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. 


డిసెంబర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా.. సక్సెస్ ఫుల్ మూవీ అనిపించుకుంది మాత్రం ఒక్కటే. సాయి ధరమ్ తేజ్.. మారుతి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి రోజు పండగే ఎంటర్ టైన్ మెంట్ కమ్ మెసేజ్ ఓరియంటెడ్ గా ఆకట్టుకుంది. సినిమా రిలీజైన వారానికే ప్రాఫిట్ లోకి వెళ్లిపోయింది. సినిమాను 18కోట్లకు అమ్మితే.. మొదటి వారంలో పెట్టుబడి రాబట్టగా.. మిగతా వచ్చిందంతా లాభాలే. 

 

 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: