తెలుగులో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు చాలా మంది ఉన్నారు.  మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘రాక్షసుడు’ సినిమాతో ఆయన తమ్ముడు నాగబాబు ఒక కీలక పాత్రలో కనిపించాడు.  ఆ తర్వాతు కొన్ని క్యారెక్టర్, హీరో పాత్రల్లో నటించారు.  తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ పాత్రలు వేస్తూనే నిర్మాతగా మారారు.  ఆయన తీసిన సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి.  అయితే రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ సినిమాతో నాగబాబు భారీ నష్టాన్ని చవిచూశారు.  ఎంతగా అంటే కొంతకాలం ఆయన డిప్రేషన్ లోకి వెళ్లిపోయారు.  అదే సమయానికి పవన్ సహాయం చేయడం తర్వాత మళ్లీ సినిమాల్లోకి రావడం జరిగింది.  ఇదే సమయంలో ఆయన తనయుడు వరుణ్ తేజ్ కూడా హీరోగా మారారు. 

 

అలాంటి సమయంలో ‘జబర్ధస్త్’ కామెడీ షోకి నాగబాబు జడ్జీగా వ్యవహరించారు.  ఆయనతో పాటు నటి, ఎమ్మెల్యే రోజా జడ్జీగా వచ్చారు.  వీరిద్దరూ కలిసి ఏడేళ్ల పాటు జబర్ధస్త్ లో జడ్జీలుగా వ్యవహరించి మంచి ఆదరణ పొందారు.  కమెడియన్లను ఎంకరేజ్ చేస్తూ వారితో అల్లరి చేస్తూ జబర్ధస్త్ కామెడీ షోకి మంచి వన్నె తెచ్చారు.  కానీ ఈ మద్య కొన్ని కారణాల వల్ల నాగబాబు జబర్ధస్త్ నుంచి బయటకు వచ్చారు. ఆయన బయటకు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని.. బిజినెస్ పరంగా తాను మాట్లాడబోనని, అక్కడ కొన్నివ్యవహారాలు తనకు నచ్చలేదని.. అన్నారు.  మొత్తానికి ఆయన జీ తెలుగు లో ‘అదిరింది’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

 

అదిరింది కామెడీ షోకి జడ్జీగా వ్యవహరిస్తున్నారు. మొదటి వారం ఆయన కూతురు నిహారిక జడ్జీ సీట్లో ఉంది. భవిష్యత్ లో ఎవరు ఉంటారో తెలియదు.  అయితే జబర్ధస్త్ లా నాగబాబుకి అదిరింది కార్యక్రమం ఎంత వరకు కలిసి వస్తుంది అన్నది తెలియాలి.  ఎందుకంటే జబర్ధస్త్ కూడా కొత్త పుంతలతో వస్తుంది.  మరి ఈ కాంపిటీషన్ నాగబాబు డీల్ చేస్తారా లేదా తెలియాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: