తెలుగు సినిమా ఓవర్సీస్ మార్కెట్ గురించి అందరికి తెలిసిందే. ఓవర్సీస్ మరో నైజాం అనే రేంజ్ లో అక్కడ సినిమా కలక్షన్స్ ఉంటాయి. అయితే 2018 లో ఓవర్సీస్ లో తెలుగు సినిమాల హవా కొనసాగింది.. కాని 2019లో మాత్రం భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా ఓవర్సీస్ లో అనుకున్న రేంజ్ అందుకోలేదు. ప్రీమియర్స్ తో హడావిడి చేసినా ఆ తర్వాత మాత్రం చతికిల పడ్డాయి. 

 

2019లో తెలుగు సినిమాలు ఓవర్సీస్ మార్కెట్ లో పెద్దగా రాణించలేదని చెప్పాలి. భారీ రేటుకి కొన్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కు నిరాశే మిగిలింది. 2019 లో భారీ అంచనాలతో వచ్చిన సాహో, సైరా, మహర్షి సినిమాలు ఓవర్సీస్ లో అనుకున్న రేంజ్ లో వసూళ్లను రాబట్టలేదు. సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు సినిమాను భారీ రేటుకి అమ్మారు. 

 

2019లో టాప్ 10 ఓవర్సీస్ వసూళ్ల లెక్క చూస్తే సాహో 3.23 మిలియన్ డాలర్స్, సైరా 2.6 మిలియన్ డాలర్స్ అయితే ఈ రెండు సినిమాలు భారీ రేటుకి డిస్ట్రిబ్యూటర్ కొనడం వల్ల నష్టాలు తప్పలేదు. మహర్షి సినిమా కూడా 1.8 మిలియన్ డాలర్స్ వసూళు చేసినా ఓవర్సీస్ లో ఫ్లాప్ అనే చెప్పాలి. 2019లో ఓవర్సీస్ లో కూడా సత్తా చాటిన సినిమాల గురించి చెప్పుకుంటే అందులో ఎఫ్-2 ముందుంటుంది. 

 

ఎఫ్-2 సినిమా 2.1 మిలియన్ డాలర్స్ తో ఓవర్సీస్ లో కూడా సూపర్ హిట్ అయ్యింది. జెర్సీ 1.3 మిలియన్ డాలర్స్, ఓ బేబీ 1 మిలియన్ వసూళు చేశాయి. మజిలీ 773కె డాలర్స్, నాని గ్యాంగ్ లీడర్ 962కె డాలర్స్ తో పర్వాలేదు అనిపించాయి. 2019 లో తెలుగు సినిమాలు ఇచ్చిన షాక్ వల్ల ఓవర్సీస్ రైట్స్ మీద ఎఫెక్ట్ పడ్డది. రీసెంట్ గా రిలీజైన సాయి తేజ్ ప్రతిరోజూ పండగే సినిమా కూడా ఓవర్సీస్ లో సేఫ్ జోన్ లోకి వెళ్లింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: