ఈ సారి సంక్రాంతి బ‌రిలో ఉన్న చిత్రాల్లో మ‌హేష్‌బాబు న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రం ఉన్న విష‌యం తెలిసిందే. ఇక ఈ మూవీ క్రేజ్ ఏంటో అంద‌రికీ తెలిసిందే. ఎప్పుడెప్పుడు సినిమా విడుద‌ల‌వుతుందా ఎప్పుడు చూశాద్దామా అన్న క్రేజ్ లో ఉన్నారు అంద‌రూ. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ అప్‌డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించి అభిమానుల్లో సంతోషం నింపారు. సరిలేరు మూవీ కాంటెస్ట్ ఒకటి ప్రకటించారు. మూవీ కాంటెస్ట్ లో జాయిన్ అయితే జనవరి 05 న జరిగే ప్రీ రిలీజ్ పాస్ , ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ దక్కించుకునే అవకాశం కలదని తెలిపారు. ఇంకెందుకు ఇప్పుడే ఈ కాంటెస్ట్ లో జాయిన్ అయి..టికెట్ , పాస్ లు దక్కించుకోండి.

 

ఇక ఈ సినిమాలో పద్నాలుగేళ్ళ వయస్సులో సూపర్‌స్టార్_కృష్ణ నటించిన కిలాడి కృష్ణుడు తో… తెలుగు సినీ ఆరంగేట్రం చేసి… పాతిక ఏళ్ళ ప్రస్థానంలో 180 సినిమాల్లో నటించిన రాములమ్మ… మళ్ళీ పద్నాలుగేళ్ళ విరామం తర్వాత ఆ సూపర్ స్టార్ వారసుడితో… రెండో ఇన్నింగ్స్‌ ను మొదలు పెట్టనుంది.
90వ దశకంలో… దక్షిణభారత సినిమా పరిశ్రమలో కథానాయిక ప్రాధాన్యత గల సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ ను ఏర్పరచుకొన్న నటి విజయశాంతి.

 

ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి వంటి సూపర్ డూపర్ హిట్స్ తో రెండు వరుస విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. ఇక అదే ఊపుతో ప్రస్తుతం అయన నటిస్తున్న కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరు. అపజయం ఎరుగని యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల కాశ్మీర్ లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు సహా, మరికొందరు ఆర్టిస్టులు పాల్గొని షూటింగ్ మొత్తం ఇటీవ‌లె స‌క్సెస్‌ఫుల్‌గా పూర్త‌యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: