టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పదేళ్ల గ్యాప్ తర్వాత కూడా చిరు తన సత్తా చూపిస్తున్నాడు. తన సినిమాను చూసి అభిమానించే ఫ్యాన్స్ కోసం ఎప్పుడూ మంచి చేయాలని ఆలోచించే చిరంజీవి ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్.. ఐ బ్యాంక్ ఇప్పటికే ఎంతోమందికి ఉపయోగపడుతుంది.

 

మెగా ఫ్యాన్స్ అందరు తమ సేవా కార్యక్రమాలతో చిరంజీవి మీద అభిమానాన్ని చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు కొత్తగా చిరంజీవి యువత ఓ గ్రేట్ డెశిషన్ తీసుకుంది. మెగా ఫ్యాన్స్ అందరికి ఇన్సూరెన్స్ సౌకర్యం కలిగిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ ఎవరైనా ప్రమాదవ శాత్తు  ఊహించని సంఘటనలు జరిగితే వారి కుటుంబానికి అండగా ఉండేలా ఈ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది.  

 

నిజంగా ఇది గొప్ప కార్యక్రమం అని చెప్పాలి. మెగా అభిమానులు తమ వివరాలను megastarchiranjeevi01@gmail.com ఈమెయిల్ చేయాలని కోరుతున్నారు అఖిల భారత చిరంజీవి యువత. నటుడిగా తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన మెగా ఫ్యాన్స్ ను ఎప్పటికి మర్చిపోని చిరంజీవి తన కార్యక్రమాలతో వాళ్లకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. చేసేది చిరంజీవి యువత అయినా ఈ ఆలోచన చిరంజీవికి వచ్చిందే అని తెలుస్తుంది. 

 

చిరంజీవి యువత చేపట్టిన ఈ గొప్ప కార్యం గురించి తెలిసిన మెగా ఫ్యాన్స్ చాలా సంతోష పడుతున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినా తమ అభిమాని కుటుంబానికి మేమున్నాం అంటూ మెగా ఫ్యాన్స్ అండదండలు ఉండబోతున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా రాం చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా దేవాదాయ శాఖకు సంబందించిన కథతో వస్తుందని టాక్.     
 

మరింత సమాచారం తెలుసుకోండి: