బాలీవుడ్‌ నటి రవీనా టండన్‌ రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన బంగారు బుల్లోడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత మరో మూడుసినిమాలు తెలుగులో చేసింది. తర్వాత నటిగా, బాలీవుడ్‌ లో నటిస్తూనే నిర్మాతగా టీవీ షోలకు వ్యవహరిస్తుంది. ఇకపోతే తరుచుగా వార్తలో నిలిచే రవీనా టండన్‌ ఇప్పుడు మరోసారి వివాదస్పద విషయం పై వార్తల్లోకి ఎక్కింది. అదేమంటే క్రిస్మస్‌ పర్వదినాన పంజాబీలో భారతీ సింగ్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న ‘బ్యాక్ బెంచర్స్’ అనే రియాలిటీ షోలో రవీనా టాండన్, దర్శకురాలు ఫరా ఖాన్ పాల్గొన్నారు. ఈ షోలో వీరిని హోస్ట్ భారతీ సింగ్ ‘హలలూయా’ స్పెల్లింగ్ రాయమని అడుగుతుంది. దానికి వారు తమ సమాధానాన్ని బోర్డుపై వేరువేరుగా రాశారు.

 

 

అంతే కాకుండా వారిద్దవురు ఆ స్పెల్లింగ్స్‌పై కాసేపు షోలో ఫన్నీ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం  క్రిస్టియన్ ఫ్రంట్ అజ్నాలా బ్లాక్ అధ్యక్షుడు సోను జాఫర్ దృష్టికి వెళ్లగా  అతను ఈ బుధవారం క్రైస్తవ మతాన్ని కించపరిచేలా ఈ షో టీం వ్యాఖ్యానించిందని అజ్నాలా పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే తన మీద నమోదు అయిన కేసు విషయంపై రవీనా టండన్‌ శుక్రవారం స్పందించారు. ఇకపోతే అమృత్‌సర్‌ పోలీసులు రవీనా టండన్‌తో పాటు కొరియోగ్రాఫర్‌ ఫరాఖాన్‌, కమెడియన్‌ భారతి సింగ్‌పై కేసు నమోదు చేశారు.

 

 

ఈ సందర్భంగా దానికి స్పందించిన రవీనా  టండన్‌.. ఎవరినీ అవమానించడం తమ ఉద్దేశం కాదని చెబుతూ, షోలో జరిగిన సన్నివేశాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. దయచేసి అందరూ ఒకసారి ఈ లింక్‌ను చూడండి. ఏ మతాన్ని అవమానించినట్లుగా నేను మాట్లాడలేదు. మేం ముగ్గురం ఎవరినీ కించపరచాలని ఎప్పుడూ అనుకోలేదు. మా మాటల వల్ల ఎవరైనా బాధపడితే వారికి నా హృదయపూర్వక క్షమాపణలు’ అని ట్వీట్‌లో కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: