ఎస్ ఎస్ రాజమౌళి ఎన్ టైగర్ ఎన్టీఆర్ తో తీసిన యమదొంగ సినిమా అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయింది. వరుస ఫ్లాపులతో ఉన్న సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ తో రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించింది. సినిమా వచ్చి దాదాపు ఇప్పటికీ 12 సంవత్సరాలు కావస్తున్న తరుణంలో ఈ సినిమాని తమిళంలో విడుదల చేయడానికి తమిళ తంబీల కోసం రాజమౌళి కొత్త ప్రయోగం చేస్తున్నాడు. బాహుబలి సినిమా తో దేశ స్థాయి తో పాటు అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ సెపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న రాజమౌళి ఆ ఇమేజ్ తో 'యమదొంగ' సినిమాని కోలీవుడ్ ఇండస్ట్రీలో తమిళంలో అనువదించి జనవరి మూడవ తారీకున సాహసోపేతంగా రిలీజ్ చేస్తున్నారు.

 

ఇప్పటికే అనేకసార్లు టీవీలో వచ్చేసిన ఈ సినిమా తమిళ వెర్షన్ లో తమిళ తంబీలు సినిమా చూస్తారో లేదో అన్న డౌట్ ఒకపక్క నెలకొంది. కానీ రాజమౌళి మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. అయితే ఒకానొక సందర్భంలో ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో 'యమదొంగ' సినిమా తనకు నచ్చలేదని రాజమౌళి భార్య రమా రాజమౌళి పేర్కొనడం జరిగింది.

 

భర్త రాజమౌళి తీసిన అన్ని సినిమాలలో 'యమదొంగ' సినిమా మాత్రమే తనకు నచ్చలేదని అప్పట్లో రమా రాజమౌళి తెలపటం పెద్ద హాట్ టాపిక్ అయింది. సినిమా వచ్చి 12 సంవత్సరాలు కావస్తున్నా రాజమౌళి మాత్రం ఈ సినిమాని తమిళంలో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. తమిళంలో అనువదించి వచ్చే ఏడాది జనవరి 3వ తారీకున కోలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: