దిల్లీ నుంచి దిగుమతి అయిన బ్యూటీ ఫుల్ గ్లామరస్ డాల్ రాశీఖన్నా కు ఇన్నాళ్లు సరైన సక్సెస్ లేదు. అవకాశాలైతే వచ్చాయి గానీ చెప్పుకోదగ్గ హిట్ సినిమాలైతే అమ్మడి ఒడిలో పడలేదు. కెరీర్ ప్రారంభించి నాలుగేళ్లు గడుస్తున్నా.. అప్పుడొక హిట్ అప్పుడొక హిట్ తో అక్కడే ఉండిపోయింది తప్ప పైకి రాలేకపోయింది. అయితే ఇది నిన్నటి మాట. 2019 రాశీ దశ తిప్పేసింది. రీసెంట్‌గా రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ నిరాశీ తన ఖాతా లో వేసుకుంది. వెంకీమామ లో నాగచైతన్యకు జోడీగా.. విలేజ్ గాళ్ పాత్ర లో మెప్పించగా.. ప్రతి రోజు పండగే సినిమాలో టిక్ టాక్ భామగా ఆడియన్స్ కు మరింత రీచ్ అయింది. రెండు సినిమాల్లో ఈ బ్యూటీ చేసిన పాత్ర కు మంచి గుర్తింపు దక్కింది. రెండు సినిమానూ తన పాత్రలకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుని కూడా సక్సెస్ అయింది. ఇన్నాళ్ళు పాటలు పాడిన రాశీ ఇప్పుడు తనకి తానే డబ్బింగ్ కూడా చెప్పుకోవడం మొదలు పెట్టింది. 

 

దీంతో ఇప్పటి వరకు రాశీని పట్టించుకోని వాళ్లు కూడా ఇప్పుడు తన మాటే ఎత్తుతున్నారు. తనే కావాలని పట్టుబడుతున్నారట. అంతేకాదు ఆడియన్స్ కూడా ఇప్పుడు రాశీ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. గతంలో కాస్త బొద్దుగా ఉండి కూడా కొన్ని అవకాశాలు జారిపోయాయి. కానీ ఈ మధ్య బాగా సన్నబడింది. చూడటానికి క్యూట్ గా ఉంది. ఇప్పుడు యంగ్ హీరోలందరికి సరిపోయో ఫిజిక్ లో అందంగా తయారైంది. ఇక హీరోయిన్ గా సక్సెస్ అయింది అని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి? అంటే టాలీవుడ్ లో రాశీ దశ మారినట్లేనని సంకేతాలు అందుతున్నా యి. ప్రస్తుతం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన 'వరల్డ్ ఫేమస్ లవర్' లో నటిస్తోంది. భారీ అంచనాల మధ్య సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రాశీ పాత్ర హైలైట్ గా ఉంటుందని ఇప్పటికే ప్రచారం జోరుగా సాగుతోంది. రౌడీ స్టార్ ఇమేజ్..దర్శకుడు క్రాంతి మాధవ్ కాన్ఫిడెన్స్ మధ్య రాశీ ఖాతాలో హ్యాట్రిక్ ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాని కె. ఎస్ రామారావు ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తున్నారు.

 

అటు కోలీవుడ్ ను విడిచి పెట్టలేదు ఈ బ్యూటీ. టాలీవుడ్ తరహాలోనే తమిళం లోనూ రాశీ రేంజ్ అంతంత మాత్రమే. అయినా ఎక్కడా ఆత్మ విశ్వాసం తగ్గకుండా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం సిద్దార్థ్ సరసన సైతాన్ కా బచ్చా అనే ఓ సినిమాలో నటిస్తోంది. హాలీవుడ్ సినిమా 'సన్నాఫ్ ఆఫ్ ది డెవిల్' ని స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. అలా రాశీ కెరీర్ సాగిపోతోంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే రాశీ నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అంతేకాదు మరో 5-6 సినిమాలు లైన్లో ఉన్నాయట. 2020 లోను రాశీ జోరు మామూలుగా ఉండదని చెప్పుకుంటున్నారు. అంతేకాదు 2020 లో రాశీ కమిటయిన సినిమాల లిస్ట్ చూస్తే మిగతా హీరోయిన్స్ కి షాకేనని మాట్లాడుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: