మెగాస్టార్, విక్టరి వెంకటేష్, నందమూరి బాలకృష్ణ ..మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోల్లో ఇప్పటికీ మన్మథుడు లుక్‌ మెయిన్‌టైన్‌ చేస్తున్న ఏకైక హీరో అక్కినేని నాగార్జున. 60 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు పోటి ఇచ్చే గ్లామర్‌తో ఆకట్టుకుంటున్న నాగ్‌ ఈ మధ్య కాలంలో మాత్రం సక్సెస్‌ల విషయంలో బాగా వెనకపడ్డాడు. రీసెంట్‌గా నాగార్జున హీరోగా తెరకెక్కిన మన్మథుడు 2 దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాతో నాగ్‌ ఇమేజ్‌, మార్కెట్‌ కూడా బాగా దెబ్బతింది. మన్మథుడు 2 రిజల్ట్‌తో షాక్‌ అయిన నాగ్‌ నెక్స్ట్ చేయాల్సిన సినిమా విషయంలో పెద్ద డైలమాలో పడ్డాడు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కించాలని ప్లాన్ చేసిన బంగార్రాజు సినిమాను పక్కన పెట్టేశాడు. సోలోమాన్‌ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేసేందుకు నాగార్జున ఓకె చెప్పినట్టుగా వార్తలు వినిపించాయి. అంతేకాదు ఈ సినిమాలో నాగ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది.

 

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌ బయటకు వచ్చింది. నాగ్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాడట. ఆల్రెడీ ఓ షెడ్యూల్ పూర్తయిందన్న టాక్‌ కూడా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. ఓల్డ్‌ సిటిలో ఐదు రోజుల పాటు కీకల సన్నివేశాలు చిత్రీకరించారు. మన్మథుడు 2 నిరాశపరచటంతో నెక్ట్స్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు కింగ్‌. అంతేకాదు సినిమాకి సంబంధించిన ఏ అప్‌డేట్స్ బయటకు రాకుండా సీక్రెట్ గా మేయిన్‌టేయిన్ చేస్తున్నారట. అయినప్పటికి ఈసినిమా అప్‌డేట్స్ రివీల్ అయిపోతున్నాయి.

 

ఇక ఈ సినిమాతో బిగ్ బాస్‌ ఫేం అలీరెజా కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు మరో బిగ్ బాస్‌ ఫేం పునర్నవికి కూడా నాగ్ ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడట. ఇక యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్స్‌ పనిచేస్తున్నారు. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తున్నాడు నాగ్‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: