దాదాపుగా ఏడేళ్లకు పైగా ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న క్రేజీ షో జబర్దస్త్ గురించి మన తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. కేవలం మన రెండుల తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరినీ సైతం ఎంతో బాగా ఆకర్షించి, అత్యధిక రేటింగ్స్ తో మరియు విపరీతమైన ప్రేక్షకాధరణతో ముందుకు సాగుతున్న ఈ షో నుండి ఇటీవల జడ్జీగా వ్యవహరిస్తున్న నాగబాబు హఠాత్తుగా బయటకు వెళ్లిపోవడం జరిగింది. అయితే జబర్దస్త్ షో నిర్వాహక బృందం అయిన మల్లెమాల సంస్థ మేనేజ్మెంట్ విభాగంలోని కొందరు వ్యక్తుల వ్యవహార శైలి తనకు నచ్చకపోవడం వల్లనే షో నుండి అర్ధాంతరంగా బయటకు రావడం జరిగిందని నాగబాబు ఒక వీడియో బైట్ ద్వారా తెలియ చేసారు. 

 

ఇక నాగబాబుతో పాటు చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ కూడా షో నుండి బయటకు రావడం జరిగింది. ఇక అందుతున్న సమాచారం బట్టి చూస్తే, వారు బయటకు వచ్చిన తరువాత షో కు వస్తున్న రేటింగ్స్ లో పెద్దగా మార్పు లేదని, అయితే భవిష్యత్తులో కూడా షో కు ఏమాత్రం ఆదరణ తగ్గకుండా ఉండేలా ఇటీవల జబర్దస్త్ యూనిట్ వారు ఎంతో ఆలోచన చేసి టీమ్స్ లో కొంత మార్పు చేసినట్టు తెలుస్తోంది. ఇక బయటకు వెళ్ళిపోయిన చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ ల స్థానంలో సరదా సత్తిపండు, అదుర్స్ ఆనంద్, మహీధర్ ల పేరుతో మూడు నూతన టీమ్స్ ని యాడ్ చేయడం జరిగింది. గతంలో చమ్మక్ చంద్ర టీమ్ లో ఒక సభ్యుడిగా మంచి పేరు దక్కించుకున్న సత్తిపండు, ప్రస్తుతం తన పేరుతో టీమ్ ని ఏర్పరుచుకున్నాడన్నమాట. 

 

ఇక ఆనంద్ కూడా చమ్మక్ చంద్ర టీమ్ లోని పలు స్కిట్స్ లో పార్టిసిపేట్ చేసి మంచి పేరు దక్కించుకున్నాడు. ఇకపోతే మొన్నటి వరకు ఆర్పీ టీమ్ లో సెకండ్ లీడ్ గా చేసిన మహీధర్ కూడా టీమ్ లీడర్ అయ్యాడు, అయితే అతడి టీమ్ పేరును మాత్రం ప్రకటించాల్సి ఉంది. ఈ విధంగా మొత్తం మూడు రకాల టీమ్ లను సరికొత్తగా సిద్ధం చేసిన జబర్దస్త్ యాజమాన్యం, ఇకపై మరింత జోష్ తో వీక్షకులకు ఆనందాన్ని పంచనుంది. మరి ఈ మార్పులు జబర్దస్త్ కు ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: