కొంత మంది హీరోలు ఏ సినిమా చేసినా కూడా దాదాపుగా అది హిట్టే. అంటే వాళ్ళ‌కు ఉండే క్రేజ్ అలాంటిది. ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చిన‌ప్ప‌టికీ ఒక‌టో రెండో ఫ్లాప్ వ‌చ్చినా అవి కూడా హిట్ కాతాలోకే వెళ్ళిపోతాయి. అంటే వాళ్ల‌కు ఉన్న క్రేజ్‌ని బ‌ట్టి ఆటోమెటిక్‌గా క‌లెక్ష‌న్లు వ‌చ్చేస్తాయి. అలాంటి క్రేజీ హీరోనే మ‌న బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్. 

 

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ది నిన్న పుట్టిన‌రోజు కావున‌  తన 54 ఏటలోకి అడుగుపెట్టాడు. అత‌ని పుట్టినరోజు సంద‌ర్భంగా బీ-టౌన్ సెలబ్రిటీస్, ఫ్యాన్స్ నుంచి విషెస్ సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తాయి. అలాగే ఆయ‌న ఫ్యాన్స్‌కి ఓ చిన్న గిఫ్ట్‌...    సల్లూభాయ్ బర్త్‌డే రోజున ఓ రేర్ ఫీట్ అందుకోవడం విశేషం. తాజాగా విడుదలైన ‘దబాంగ్ 3’ సినిమాతో ఈ రికార్డును సొంతం చేసుకున్న సల్మాన్.. బాక్స్‌ ఆఫీస్ బాద్షా తానేనంటూ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అదేంటంటే...

 

బాలీవుడ్‌లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాల్లో ఒక్క సల్మాన్ ఖాన్‌వే 15 ఉండటం విశేషం. టాక్‌తో సంబంధం లేకుండా అతడి సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ అదరగొట్టాయి. 2017లో విడుదలైన ‘టైగర్ జిందా హై’ దాదాపు రూ.339 కోట్లు కలెక్ట్ చేసి భాయ్ సినిమాల్లో మొదటి వరుసలో నిలిచింది.

 

భజ్‌రంగి భాయ్‌జాన్‌, సుల్తాన్‌, కిక్‌, భారత్‌, ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో, ఏక్‌ థా టైగర్‌, రేస్‌ 3, దబాంగ్‌ 2, బాడీగార్డ్‌, దబాంగ్‌, రెడీ, ట్యూబ్‌లైట్‌, జైహో, దబాంగ్‌ 3 ఇలా పలు సినిమాలు వంద కోట్లు క్లబ్‌లో చేరాయి. ఇక సల్మాన్ తర్వాత అక్షయ్ కుమార్ 14 సినిమాలతో రెండో స్థానంలో ఉండగా.. ఆ తర్వాత షారుక్ ఖాన్(7), అమీర్ ఖాన్(6), హృతిక్ రోషన్, అజయ్ దేవగన్‌, రణ్‌వీర్ సింగ్, రణబీర్ కపూర్‌లు ఉన్నారు. ఏది ఏమైన‌ప్ప‌టికీ మ‌న స‌ల్లూభాయ్ చాలా గ్రేట్ అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: