సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడిల కలయికలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ఇటీవల పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్ లో సాగుతున్న ఈ సినిమాను మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకర ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, మురళీశర్మ, రావు రమేష్, రఘు బాబు , సునీల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హరితేజ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తుండగా, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి

 

భారతి అనే ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన నలుగురు సాంగ్స్ కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ రావడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా నుండి ఐదవ సాంగ్ టీజర్ ని నేటి సాయంత్రం 7 గంటల 2 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. విశాఖపట్నంలో ప్రస్తుతం జరుగుతున్న ఉత్సవ్ లో భాగంగా యూనిట్ సభ్యులు ఈ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. 

 

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటించిన ఈ ప్రత్యేక సాంగ్, హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అని సమాచారం. మంచి పెప్పి నెంబర్ గా డ్యాంగ్ డ్యాంగ్ అనే పల్లవితో సాగె ఈ సాంగ్ కు దేవిశ్రీప్రసాద్ సూపర్ ట్యూన్ ని అందించాడని, తప్పకుండా ఈ సాంగ్ , రేపు థియేటర్స్ లో ఊపేయడం ఖాయం అని లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ట్వీట్ చేసారు. కాగా ఈ సాంగ్ పూర్తి లిరికల్ వీడియో ని సోమవారం సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో రెండు హిట్స్ కొట్టిన మహేష్ బాబు, ఈ సినిమా కూడా హిట్ అయితే హ్యాట్రిక్ కొట్టినట్లే.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: