బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా బాలీవుడ్ స్టార్ హీరోలందరి లో సల్మాన్ ఖాన్ కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. సల్మాన్ ఖాన్ తీసే సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చాక్లెట్ బాయ్ గా ఉన్న సల్మాన్ ఖాన్ ఇప్పుడు కండల వీరుడిగా తన సిక్స్ ప్యాక్ తో అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇంత  ఏజ్ వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ సిక్స్ ప్యాక్ తో అందరిని ఔరా  అనిపిస్తున్నాడు సల్మాన్ ఖాన్. అయితే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నిన్న  తన 54వ పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. కాగా సల్మాన్ ఖాన్ బర్త్ డే విషెస్ సోషల్ మీడియా హోరెత్తాయి. 

 


 ఇక సల్మాన్ ఖాన్ పుట్టినరోజునే సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. బర్త్ డే రోజున అన్నయ్యకు చెల్లెలు అర్పిత ఖాన్ కోడలిని  గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ క్రమంలో తన సోదరి కూతురు ఆయత్ ను  చూడడానికి సల్మాన్ ఖాన్ కుటుంబ సమేతంగా వెళ్లారు. సల్మాన్ ఖాన్ తల్లిదండ్రులు సలీమ్  సల్మా సోదరుడు సొహైల్ ఖాన్ తో పాటు కలిసి సల్మాన్ ఖాన్ ముంబైలోని హిందూజా హాస్పిటల్ కి వెళ్లారు. ఈ ప్రయాణంలో సల్మాన్ ఖాన్ తో పాటు గర్ల్ ఫ్రెండ్ లులియా  సైతం ఉన్నారు. సంగీతా బిజ్లానీ కూడా అర్పితా ఖాన్  కూతురు ని చూడడానికి వచ్చారు. అంతకు ముందుగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 


 మరోసారి మామయ్యను అయ్యానంటూ ఆనందం వ్యక్తం చేశారు సల్మాన్ ఖాన్. ఈ ఏడాది తన పుట్టినరోజు నాడు ఎంతో గొప్ప బహుమతి అందుకున్న అంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇది తనకెంతో ప్రత్యేకమైందని సల్మాన్ ఖాన్ తెలిపారు. అయితే తన చెల్లెలు అర్పిత ఖాన్ రెండవ బిడ్డకు అయత్ పేరు పెట్టడానికి కారణం ఏంటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... కుటుంబంలోని అందరి పేర్లు ఎస్ లేదా ఏ తోనే మొదలయ్యాయని అందుకే అయత్  పేరు పెట్టాం అంటూ సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. మరోసారి మామయ్యను అయ్యాను కానీ తండ్రి మాత్రం కాలేకపోయాను అని నవ్వుతూ సల్మాన్ ఖాన్ చమత్కరించారు. ఇకపోతే సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ 3 వంద కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ లో 100 కోట్లు క్లబ్  లో చేరిన సినిమాలలో అత్యధికంగా సల్మాన్ నటించిన సినిమాలే ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: