బుల్లితెర రొమాంటిక్ జోడీ రష్మి, సుడిగాలి సుధీర్‌లపై సోషల్ మీడియా ఎప్పుడూ హాట్ టాపిక్ నడుస్తూనే ఉంటుంది. వీరిద్ద‌రి ఆన్ స్క్రీన్ రొమాన్స్ పై ఎప్పుడూ వార్త‌లు వ‌స్తూనే ఉంటాయి. అయితే వీటిపై ఈ ఇద్దరూ పలు సందర్భాల్లో స్పందిస్తూ అలాంటిదేం లేదని కుండబద్దలు కొట్టేసినా.. యూట్యూబ్ ఛానల్స్‌ ఈ ఇద్దర్నీ జత కలుపుతూ పెళ్లి వరకూ తీసుకువెళ్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ప్రస్తుతం సినిమా హీరో అవతారం ఎత్తేశాడు. కమెడియన్స్ హీరోలుగా మారడం అనేది బ్లాక్ అండ్ వైట్ కాలం నుండి కొనసాగుతున్న సంప్రదాయమే. జబర్దస్త్ కామెడీ షోతో క్రేజ్ సంపాదించిన సుడిగాలి సుధీర్.. ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ చిత్రంతో హీరోగా మారారు. సుధీర్, ధన్య బాలక్రిష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 28న(నేడు) ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. 

 

రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో సుధీర్ పూర్తి స్థాయి హీరోగా మెప్పించాడు. అయితే ఈ సినిమాలో అతడి సరసన హీరోయిన్ గా నటించిన ధన్య బాలక్రిష్ణ మాత్రం అంతగా కెమిస్ట్రీ పండించలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం ధన్యకు సుడిగాలి సుధీర్ క్రేజ్ తెలియకపోవడమే అనే టాక్ వినిపిస్తోంది. ఇక సాఫ్ట్ వేర్ సుధీర్ కనుక పెద్ద హిట్ అయ్యి ఉంటే ధన్య బాలక్రిష్ణ కెరీర్ ఊపు అందుకునేదని నెట్టింట ఫ్యాన్స్ అంటున్నారు. అయితే రష్మీ మాత్రం ఈ విషయంలో కాస్త సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. 

 

ధన్య ఈ సినిమా విషయంలో మరికాస్త శ్రద్ధ పెట్టిఉంటే బాగుండేదని, సుడిగాలి సుధీర్ లాంచింగ్ సినిమాలో ఇలా అశ్రద్ధగా చేయడం ఏంటని ఫైర్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. మ‌రోవైపు అభిమానులు కూడా. ధన్యకు సుడిగాలి సుధీర్ లాంటి స్టార్ పక్కన నటించడం చాలా గొప్పే అని, నెట్టింట సుధీర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాస్త‌వానికి ధన్య బాలక్రిష్ణ స్వతహాగా హీరోయిన్ కాదు..ఆమె గతంలో కొన్ని వెబ్ సిరీస్ లలో నటించడంతో పాటు, హీరోయిన్ల పక్కన స్నేహితురాలి పాత్రల్లో నటించింది. అయితే సుడిగాలి సుధీర్ పక్కన ధన్య సరిపోలేదని, అంతేకాదు సుడిగాలి సుధీర్ రేంజ్ ఏంటో తెలియకుండా ధన్య ఈ సినిమాను ఆషామాషీగా తీసుకుందని, అందుకే ఇద్దరి కెమిస్ట్రీ పండలేదనే వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: