సమర సింహారెడ్డి, నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్..ఇలాంటి సినిమాలు బాలయ్య అభిమానులకే కాదు యావత్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఫ్యాక్షన్ బ్యాగ్డ్రాప్ లో వచ్చే సినిమాలకి బాలయ్య సినిమాలే ఉదాహరణగా తీసుకున్నారు ఒకప్పుడు. బాలయ్య తొడ కొడితే చాలు థియోటర్స్ లో జనాలు చప్పట్లు కొట్టే వాళ్ళు. కానీ ఆ తర్వాత బాలయ్య సినిమాలు ఎందుకనో జనాలను ఆకట్టుకోలేకపోతున్నాయి.  ఆ మధ్య పూరి తో పైసా వసూల్ చేద్దామన్న కాలేదు. కానీ ఆ సినిమాలో బాలయ్య యాక్టింగ్ పూరి మేకింగ్ మాత్రం అబ్బో అనిపించాయి. అబ్బా ఈ వయసులో కూడా బాలయ్య పోకిరీకి పోటీగా నటించాడే అనిపించేలా పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పి మావా ఎక్ పెగ్ లా అని రిలాక్స్ అయ్యారు. 

 

ఆ తర్వాత తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో జై సింహా గా వచ్చి గర్జించలేకపోయాడు. తర్వాత తండ్రి బయోపిక్ గా వచ్చిన ఎన్.టి.ఆర్. కథానాయకుడు.. మహానాయకుడు దారుణంగా పరాజయ్యాన్ని మూటగట్టుకున్నాయి. ఆ దెబ్బ బాలయ్యకి గట్టిగా తగిలింది పాపం. అయితే మళ్ళీ తమిళ దర్శకుడిని నమ్ముకొని రూలర్ అంటూ హడావుడి చేశారు. కానీ ఆ సినిమా ఫస్ట్ లుక్ నుండే నెగిటివ్ టాక్ ని వెనకేసుకుంటూ వచ్చింది. పోలీస్ గెటప్ లో బాలయ్య  అసలు సూట్ కాలేదని అంటుండగానే రూలర్ రిలీజై డిజాస్టర్ గా మిగిలింది. దీంతో బాలయ్య పరిస్థితి డైలమాలో పడింది. అసలే మూలిగే నక్కలా ఉంది బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి పరిస్థితి. ఈ ఇద్దరు బాలయ్య మీద బోలెడన్ని ఆశలు పెట్టుకుంటే రూలర్ తో ఆ ఇద్దరికి దిమ్మతిరిగే షాకిచ్చాడు బాలయ్య. 

 

ఊపుమీదున్న బోయపాటికి బ్రేక్ వేశాడు బాలయ్య. పాపం ఇక నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కైతే దిక్కు తోచని పరిస్థితి. బోయపాటితో ఇంతకముందు రెండు సినిమాలు నిర్మించాడు మిర్యాల రవీందర్ రెడ్డి. ఆ రెండు సినిమాలు ఫ్లాప్ గా మిగిలాయి. అయినా మొండి ధైర్యం తో బాలయ్య సినిమాకి కమిటయ్యాడు. రూలర్ హిట్టవుతుందనే నమ్మకంతో ఈ సినిమాని దాదాపు 70 కోట్ల తో నిర్మించాలనుకున్నాడు. కానీ ఇప్పుడు రూలర్ ఫ్లాప్ తో నిర్మాత దర్శకుడు బాలయ్య ఫ్యాన్స్ ఎంతపని చేశారు బాలయ్యో .. బాలయ్యా అంటూ బాధ పడుతున్నారట.    

మరింత సమాచారం తెలుసుకోండి: