దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి సినిమా సృష్ఠించిన సంచలనాల గురించి ప్రపంచం మొత్తం తెలిసిందే. బాహుబలి రిలీజ్ తర్వాత.. రమ్యకృష్ణ నటించిన శివగామి పాత్రకు వచ్చిన ఐడెంటిటీని క్యాష్ చేసుకునేందుకు ఫిలింమేకర్స్ అందరు చేయని ప్రయత్నం లేదు. కేవలం శివగామి కథను ఎంచుకుని వెబ్ సిరీస్ లు.. సినిమాలు అంటూ ప్రకటించడం చూస్తే.. ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో రాణి శివగామి అనే సినిమా తెరకెక్కుతోంది. కన్నడ- తెలుగు ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది. అయితే అంతగా బజ్ మాత్రం క్రియోట్ అవడం లేదు.

 

అలాగే శివగామి ప్రధాన పాత్రలో బాహుబలి నిర్మాతలే నెట్ ఫ్లిక్స్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు. శివగామి అనే టైటిల్ తో ఇది రూపొందుతోంది. వెబ్ సిరీస్ కి ప్రవీణ్ సత్తారు- దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఇక ఇప్పటికే మొదటి సీజన్ ఎనిమిది ఎపిసోడ్లు చిత్రీకరించారు. ఆనంద్ నీలకంఠ రచించిన 'ది రైజ్ ఆఫ్ శివగామి' ఆధారంగా ఈ సిరీస్ ని తెరకెక్కించారు. బాహుబలి నిర్మాతలు ఆర్కా మడియా వాళ్లు సహనిర్మాతలుగా వ్యవహరిస్తుండగా... నెట్ ఫ్లిక్స్ పెట్టుబడులు పెడుతోంది. ఇప్పటికే ఫైనల్ కట్ రెడీ అయ్యిందని.. వీఎఫ్.ఎక్స్ సహా మిగతా వర్క్ అంతా పూర్తయిందని తెలుస్తోంది. ముఖ్యమైన ఎపిసోడ్స్ అన్నీ పూర్తయిపోయాయట. అయితే ఫైనల్ విజువల్స్ మాత్రం ఆర్కా వాళ్లను.. నెట్ ఫ్లిక్స్ ప్రతినిధుల్ని పూర్తిగా మెప్పించలేకపోయాయిట. అందుకే డైలమాలో ఉన్నారని ఓ ప్రచారం జోరుగా సాగుతోంది.

 

బాహుబలి రేంజు సినిమా చూశాక.. శివగామి పాత్రను పెద్ద తెరపై చూసిన ఆడియెన్ ని మెప్పించడం అంటే అంత ఈజీ కాదని తెలిసిందే. అంతకుమించిన కథ-కథనం.. గ్రిప్పింగ్ నేరేషన్ తో మెప్పించాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళినే రంగంలోకి దించి రిపేర్లు చేయిస్తారా? అంటూ మరో ఆసక్తికర ప్రచారం సాగుతోంది. అయితే ఇవన్నీ నిజమా? కేవలం అసత్య ప్రచారమా? అన్నది దేవాకట్టా టీమ్ క్లారిటీ ఇస్తేగాని తెలుస్తుంది. అయితే ఒకవేళ జక్కన్న మాత్రం రంగం లోకి దిగితే మొత్తంగా ఇన్వాల్వ్ అవుతారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: