లేడి సూపర్ స్టార్ నయనతార, దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ నటిస్తోన్న నటి. ఇక లేడీ ఓరియంటెడ్ చేయాలంటే నయనతార తర్వాతే ఎవరైనా అనేంతగా గుర్తింపు తెచ్చుకొని.. సౌత్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా వార్తల్లో నిలిచింది. నయనతార తమిళంలో హీరోయిన్‌గా చేస్తూనే మరో పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్‌గా మారి దుమ్ము దులుపుతోంది.  నిజానికి హీరో ఓరియెంటెడ్ సినిమా చేసినా కూడా చివ‌రికి న‌య‌న్ వ‌చ్చిందంటే అది లేడీ ఓరియెంటెడ్ సినిమా అయిపోవాల్సిందే. ఈ నేప‌థ్యంలోనే అన్ని చోట్లా ఆమెకు అభిమానులున్నారు. అయితే లేడీ సూపర్‌స్టార్‌ నయనతార 2019లోనూ అగ్రస్థానంలో నిలిచింది. 

 

ఆమె నటించిన ‘విశ్వాసం’, ‘ఐరా’, ‘మిస్టర్‌ లోకల్‌’, ‘కొలైయుదిర్‌ కాలం’, ‘బిగిల్‌’ చిత్రాల్లో ఈ ఏడాదిలోనే విడుదలయ్యాయి. ఇక నేటి అందాలతారల కంటే మునుపటి తార జ్యోతిక మూడు సినిమాలతో రెండో స్థానంలో నిలిచింది. పెళ్లి త‌ర్వాత కొన్నేళ్ళు గ్యాప్ తీసుకున్న‌ జ్యోతిక మ‌ళ్లీ జాక్‌పాట్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక  ‘రాక్షసి’, ‘జాక్‌పాట్‌’ చిత్రాల్లో సోలో హీరోయిన్‌గా మెప్పించిన ఆమె.. ఏడాది చివరలో వచ్చిన ‘తంబి’లో సోదరిగా ప్రశంసలందుకుంది. అలాగే ‘ఆడై’లో నగ్నంగా నటించి అమలాపాల్‌, ‘90ఎంఎల్‌’లో బోల్డుగా నటించిన ఓవియాలు సంచలనం రేపారు. 

 

ఇక‌ 2018లో ఐదు సినిమాలతో టాప్‌లో నిలిచిన కీర్తిసురేష్‌ ఈ ఏడాది ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. అయితే ‘మహానటి’కి జాతీయ అవార్డు దక్కడంతో మరె హీరోయిన్‌కు దక్కని ఘనతను సొంతం చేసుకుంది. మిల్క్‌బ్యూటీ తమన్నా ‘కన్నే కలైమానే’, ‘పెట్రోమాక్స్‌’, ‘దేవి2’, ‘యాక్షన్‌’తో నాలుగు చిత్రాల్లో, మేఘా ఆకాష్‌, కేథరిన్‌ థెరిసా, ఐశ్వర్య రాజేష్‌ మూడేసి చిత్రాల్లో కనిపించినా ఆశించిన మేరకు విజయాలు దక్కలేదు. నిక్కగల్రానీ రెండు సినిమాల్లో నటించింది. ఇక చివ‌రిగా అందాలతారలు త్రిష, హన్సిక ఒక్కో చిత్రంతోనే సరిపెట్టుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: