'టెంపర్' సినిమా నుండి జూనియర్ ఎన్టీఆర్ వరుసగా విజయాలు సాధిస్తూ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తన క్రేజ్ మరియు మార్కెట్ రోజు రోజుకి పెంచుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి తర్వాత దర్శకత్వం వహిస్తున్న ‘RRR’ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో భారీ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఇటువంటి తరుణంలో ఏ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పట్టించుకోని డైరెక్టర్ల గురించి రకరకాల పేర్లు ఇటీవల వినపడుతూ వస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా అని అంతేకాకుండా కే జి ఎఫ్ డైరెక్టర్ తో చేస్తున్నట్లు ఇంకా అనేకమంది డైరెక్టర్ ల పేర్లు ఇటీవల వినబడ్డాయి.

 

వీరిలో మురుగదాస్ తో కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినపడ్డాయి. అయితే మురుగదాస్ తో సినిమా ఉందా లేదా అన్న టెన్షన్ ఇప్పుడు నందమూరి అభిమానుల్లో నెలకొని ఉండడంతో ప్రస్తుతం మురగదాస్ సూపర్ స్టార్ రజినీకాంత్ తెరకెక్కించిన దర్బార్ సినిమా ప్రమోషన్లో మురగదాస్ చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే త్వరలో ఎన్టీఆర్ తో సినిమా ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది. మేటర్ ఏమిటంటే ‘స్పైడర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించలేకపోయాను అంటూ దర్బార్ సినిమా ప్రమోషన్లో కామెంట్ చేశారు. అయితే త్వరలోనే మరొక టాప్ హీరో తో సినిమా చేయబోతున్నట్లు కచ్చితంగా ఈసారి గ్యారెంటీగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తా అంటూ మురుగదాస్ కామెంట్ చేయడం జరిగింది.

 

భవిష్యత్తులో తెలుగు సినిమా లో చేయబోయే సినిమాలో 'స్పైడర్' లో జరిగిన తప్పులు జరగకుండా చూసుకుంటాను అని ఖచ్చితంగా ఆ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించడం జరుగుతుందని ఏఆర్ మురుగదాస్ పేర్కొన్నారు. మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో rrr సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. మొత్తంమీద మురగదాస్ మాటలు వింటే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో చేయబోయే తెలుగు సినిమా జూనియర్ ఎన్టీఆర్ తోనే అన్నట్టుగా ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: