ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన బిగ్ బాస్ హిందీలో ఇప్పటికీ 13 సీజన్లు నడుస్తున్నాయి.  మొదటి నుంచి బాలీవుడ్ లో బిగ్ బాస్ కి కండల వీరుడు సల్మాన్ ఖాన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  ఇప్పటి వరకు పన్నెండు సీజన్లు పూర్తయ్యాయి. అయితే ప్రతి బిగ్ బాస్ సీజన్ కి ఏదో ఒక పెద్ద కాంట్రవర్సీ ఉన్నా రోజు రోజుకీ పాపులారిటీ పెరిగిపోతూనే ఉంది.  బిగ్ బాస్ బాలీవుడ్ లోనే కాకుండా తెలుగు, తమిళ, మళియాళ, కన్నడ, మరాఠీ లో కూడా వస్తుంది.  తెలుగు లో బిగ్ బాస్ 3 కి నాగార్జున హూస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.  ఈసారి బిగ్ బాస్ 3 విజేతగా సింగర్ రాహూల్ సిప్లిగంజ్ గెలిచారు.  అయితే బాలీవుడ్ లో వస్తున్న బిగ్ బాస్ నుంచి ఎంతో మంది బాలీవుడ్ సినీ తారలు గా మారారు. 

 

తాజాగా బాలీవుడ్ లో వస్తున్న బిగ్ బాస్ సీజన్ 13 పై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. కానీ ఏనాడు సల్మాన్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు. తాజాగా బిగ్ బాస్ సీజజన్ 13 లో సల్మాన్ ఖాన్ చేసిన పనికి అందరూ షాక్ తిన్నారు. కంటెస్టెంట్స్ అంతా పడక గదుల్లో నిద్రపోతుండగా చడీచప్పుడు కాకుండా హౌస్ లోకి ప్రవేశించిన సల్మాన్ అక్కడి వంట గది, బాత్ రూంల నిర్వహణ సరిగా లేకపోవడం గుర్తించారు. దీంతో తానే స్వయంగా రంగంలోకి దిగి వాటిని శుభ్రం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

హౌస్ లోని కంటెస్టెంట్స్ తామున్న ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం లేదని సల్మాన్‌ గుర్తించారు. దీంతో అయనే చర్యలు చేపట్టారు. సల్మాన్ హౌస్ లో ఉన్నంత సేపు  కంటెస్టెంట్స్ ఉన్న పడక గదుల తలుపులు మూసుకుపోయాయి. అయితే బిగ్ బాస్ లో సల్మాన్ ఖాన్ చేసిన పనికి ఇంటి సభ్యులు సిగ్గు పడుతూ తాము చేసిన తప్పుకు ఆయనను  క్షమాపణలు కోరారు.  ఇక నుంచి ఇలాంటి తప్పులు చేయమని ఇంటి విషయంలో సుచీ సుభ్రత పాటిస్తామని హామీ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: