టెలివిజన్ రంగంలో జబర్దస్త్ కామెడీ షో తో పాపులర్ అయిన సుడిగాలి సుదీర్ అడపాదడపా టాలీవుడ్ ఇండస్ట్రీలో మెల్లగా చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ సినిమా రంగంలో కూడా రాణిస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్ చేసి అదరగొట్టిన సుడిగాలి సుధీర్ తాజాగా హీరోగా ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ అనే టైటిల్ తో మొట్టమొదటి సినిమా చేయడం జరిగింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగా అలరించింది. కథ విషయానికి వస్తే మంత్రి దగ్గర పనిచేసే సుధీర్ తండ్రి సుడిగాలి సుధీర్ కి సాఫ్ట్ వేర్ జాబ్ ఇప్పించడం జరుగుతుంది. సినిమాలు సుధీర్ చాలా అమాయకమైన పాత్ర చేశాడు. ఎంత ట్రై చేసిన అమ్మాయిలు పడకపోవడంతో అలాంటి సందర్భంలో సుడిగాలి సుదీర్ ని ధన్య బాలకృష్ణ ఇష్టపడుతుంది.

 

ఇరు కుటుంబాలు పెళ్లి కి రెడీ అవ్వగా అనుకోకుండా ఒక సమస్య వస్తుంది. ఆ సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఒక స్వామీజీ దగ్గరికి సుధీర్ వెళ్లగా ఒక భారీ స్కాం లో అనుకోకుండా ఇరుక్కుపోతాడు. అసలు ఆ స్కామ్ ఏంటి? హీరో ఎలా ఇరుక్కున్నాడు ?ఎలా బయటపడ్డాడు ? దాని వెనకాల ఎవరు ఉన్నారు ? ఈ విశేషాలన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమాలో సుదీర్ నటన విషయానికొస్తే జబర్దస్త్ షోలో ఫుల్ ఎనర్జిటిక్ గా నటించిన సినిమాలో మాత్రం క్యారెక్టర్ కి తగ్గ రీతిలో నటించాడు.

 

డ్యాన్స్ విషయంలో బాగా చేశాడు. అయితే ఈ విషయంలో సుధీర్ చేసిన ఫైట్లు సినిమాలో థియేటర్లలోకి వచ్చిన ప్రేక్షకులను అలరించలేకపోయింది. సుధీర్ కి కాస్త ఓవర్ అయినట్లు సినిమా ఫైట్ లో కనబడింది. ఓవరాల్ గా సినిమా ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండాఫ్ పూర్తిగా నిరాశ పరిచింది. అయితే సుధీర్ ఎంట్రీ ఫస్ట్ సినిమా కావడంతో హీరోగా సుధీర్ సినిమాలో అన్ని విషయాలలో పర్వాలేదనిపించాడు. సినిమా హిట్టా..? ఫట్టా..? విషయానికొస్తే ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ యావరేజ్ అనిపించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: