అల వైకుంఠపురంలో చిత్ర యూనిట్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ని ఎప్ప‌టిక‌ప్పుడు అటెన్ష‌న్‌లో ఉంచుతున్నారు. నేడు ఈ చిత్ర మ్యూజిక్ కాన్సర్ట్ వచ్చే నెల 6న నిర్వహిస్తున్నామని ఒక విషయాన్ని పంచుకున్న చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా మరో సడన్ సర్పైజ్ ఇస్తారని చెప్పారు. సాయంత్రం 6:00 గంటలకు అలవైకుంఠపురంలో చిత్రం నుండి ఓ ఆసక్తికర అప్డేట్ వస్తుంద‌ని ఫ్యాన్స్ తెగ ఎదురు చూసేలా చేశారు ఈ చిత్ర యూనిట్‌. ఆ అప్డేట్ ఏమై ఉంటుందో అని అభిమానులలో ఆసక్తి పెరిగిపోయింది.

 


ఇక హీరో అల్లు అర్జున్ నిరవధికంగా ఈ చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నారు స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ టబు ఓ కీలక  పాత్ర పోషిస్తున్నారు. సుశాంత్, నివేదా పేతురాజ్ కూడా కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది.

 


అయితే ఇప్పుడు ఈ చిత్రం నుంచి పూజా హెగ్డే, అల్లుఅర్జున్ న‌టించిన మంచి రొమాంటిక్ సాంగ్ ఒక‌టి ప్రోమోగా విడుద‌ల చేశారు.  ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. నూతన సంవత్సరం సందర్భంగా బన్ని అభిమానులకు ఒక సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ ఏడాది నెటిజన్ల నుంచి విశేష ఆదరణ పొందిన ‘సామజవరగమన’ పాట సాంగ్‌ ప్రోమోను డిసెంబరు 31న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా పాట ప్రీ టీజర్‌ను విడుదల చేసింది.  కాగా ఇంతకు ముందు విడుదలైన పాటలకు విశేషమైన స్పందన లభించింది. వాటిలో  ‘సామజవరగమన..’ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతూ..యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించింది. బన్నీ ఈ చిత్రంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా కనిపిస్తున్నాడు. ఇక పూజా హెగ్డే బన్నీ పనిచేసే ఆఫీస్ హెడ్ గా అతనికి లేడీ బాస్ రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: