పూజా హెగ్డే 2014 లో ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ తన  కెరీర్‌లో హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా దూసుకు పోతుంది.  యువతని ఆకర్షించే అందంతో పాటు సాంప్రదాయ బద్ధంగా కనిపిస్తూనే హాట్ అప్పియరెన్స్ తో కవ్వించే విలక్షణత సొంతం చేసుకున్న పూజా అల్లు అర్జున్ 'డీజె' లో వేసిన బికినీకి రాఘవేంద్రరావు అభిమానుల నుంచి రామ్ గోపాల్ వర్మ అభిమానుల వరకూ అందరూ చిత్తై పోయారు.

 

 

ఇక 'గద్దలకొండ గణేష్' చిత్రంలో రీమిక్స్ పాటలో ఒక్కసారిగా తన గ్లామర్ తో మెరిసింది. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది.. ఇకపోతే తాజాగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘అల..వైకుంఠపురములో’ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఇదివరకే వచ్చిన చిత్రాలు సూపర్‌ డూపర్‌ హిట్‌ సాధించడం తో సాధారణంగానే ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

 

 

దీనికితోడు పాటలతో పాటు టీజర్‌ కూడా ఓ రేంజ్‌లో ఉండటంతో బన్ని, త్రివిక్రమ్‌లు హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని సినీ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఇకపోతే పూజా హెగ్డే ‘బుట్టబొమ్మ’సాంగ్‌ పాట షూట్‌కు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్‌ చేస్తూ ఇది ఎవరికీ చెప్పకండి అంటూ సరదాగా కామెంట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టు కుంటోంది. అంతేకాకుండా ఈ సాంగ్‌లో బన్ని, పూజాల జంట చూడ ముచ్చటగా ఉందని కామెంట్‌ చేస్తున్నారు.

 

 

ఇకపోతే సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో సుశాంత్, నివేతా పేతురాజ్, టబు, జయరామ్‌ నటిస్తుండగా, అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం సమకూర్చుతున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: