సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల హీరోగా నటించిన 2.0, పేట సినిమాలు రెండూ కూడా మంచి హిట్స్ అందుకుని, ఎప్పటినుండో వరుస పరాజయాలతో సతమతం అవుతున్న ఆయనకు కెరీర్ పరంగా మంచి బ్రేక్ ని అందించాయి. ఇక ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తున్న సినిమా దర్బార్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్, అలానే దుమ్ము ధూళి అనే సాంగ్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ సంపాదించడంతో పాటు సినిమాపై విపరీతంగా అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. 

 

ఇకపోతే నేడు ఈ సినిమా నుండి డుమ్ డుమ్ అనే పల్లవితో సాగె పెళ్లి సాంగ్ వీడియో ప్రోమోని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. హీరో రజినీకాంత్ తో పాటు హీరోయిన్ నయనతార కలిసి నటించిన ఈ సాంగ్, ప్రస్తుతం శ్రోతలను విశేషంగా అలరిస్తోంది. హీరోయిన్ ని టీజ్ చేస్తూ, రజిని తనదైన మాస్ స్టైల్ లో వేసిన స్టెప్స్ కు ఆయన ఫ్యాన్స్ ఎంతో ఖుషి అవుతున్నారు. ఇక ఈ సాంగ్ కు అనిరుద్ అందించిన సంగీతం మరింత ఆకర్షణను తీసుకువచ్చింది. 

 

ఇక ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. రజిని, నయనతార కలిసి నటిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్ గా నటిస్తున్నాడు. మంచి మాస్, కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజిని, ఆదిత్య అరుణాచలం అనే మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న పలు భాషల్లో ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.....!

మరింత సమాచారం తెలుసుకోండి: