ప్రతీసారు అందరిలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా 2019లో ఏం సాధించానబ్బా ..! అని ఓసారి బాలయ్య డైరీ తీసి చుసుకున్నారట. అయితే.. ఈ ఏడాది పెద్దగా కలిసిరాలేదని.. ఏమాత్రం తృప్తి కలగలేదని ఒక్క విషయం కాస్త ఊరటనిచ్చిందని అని ఫీలవుతున్నారట. ఇక ఈ సంవత్సరం లో బాలయ్య సినిమాలుగా బాగానే వచ్చాయి.. అంతేకాదు ఇదే సంవత్సరం 2019 సార్వ్రత్రిక ఎన్నికలు కూడా వచ్చాయి. అయితే సినిమాలేవీ బాలయ్య ఆశించినంతగా ఆడకపోగా.. అట్టర్ ప్లాప్ అవ్వడం బాలయ్య ఫ్యాన్స్ కి, నందమూరి ఫ్యాన్స్‌ కి మింగునపడట్లేదు. ఈ సంవత్సరమే అన్నగారు .. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్‌ అంటూ రెండు పార్ట్‌లతో బాలయ్యే నటించి అట్టహాసంగ అభిమానుల ముందుకొచ్చారు. 

 

అయితే.. ఎన్.టి.ఆర్. 'కథానాయకుడు', 'మహానాయకుడు' సినిమాలు రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండూ ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాయి. అలా ఈ రెండు సినిమాలు ఒకదానికి మించి మరొకటి డిజాస్టర్ అవడం బాలయ్యకి ఒక చేదు అనుభవమేనని సినీ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా ఈ బయోపిక్‌ల ద్వారా ఎన్నికల్లో కూడా ప్లస్ అవుతుందని టీడీపీ శ్రేణులు, మరీ ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంబరపడ్డారు. అయితే అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్నట్టుగా ఆశలు ఆవిరైపోయాయి. సినిమాలు ఫ్లాపవడంతో సీన్ మొత్తం రివర్స్ అయి.. రాష్ట్రం మొత్తమ్మీద కేవలం 23 అంటే స్థానాలకే టీడీపీ పరిమితం అవ్వడం..రాయలసీమలో హిందూపురం నుంచి బాలయ్య, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, కుప్పం నుంచి నారా చంద్రబాబు తప్ప మరెక్కడా టీడీపీ అడ్రస్ లేకుండా పోయింది.

అయితే పార్టీ ఘోరంగా ఓడిపోవడం తీవ్ర బాధను మిగిల్చితే.. హిందూపురంలో బాలయ్య గెలవడం ఒకట్రెండు శాతం సంతోషం కలిగించే విషయం. టీడీపీ స్థాపించిన నాటి నుంచి హిందూపురంలో పార్టీ ఓడిన దాఖాలే లేవు.. ఈ ఎన్నికల్లో అది కూడా వైసీపీ ప్రభంజనంలో నిలిచి తట్టుకుని గెలవడం విశేషమేనని చెప్పుకోవాలి. ఈ రకంగా బాలయ్య 2019 లో సాధించింది ఇదొక్కటే. అయితే.. ఆ తర్వాత 'రూలర్' గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య మరో డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకోవడమే కాదు ఎన్నో ఆశలు పెట్టుకున్న బోయపాటికి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కి షాకిచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: