తెలుగు లో వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో కి ఇప్పటి వరకు ఎదురు లేకుండా దూసుకు పోతున్న విషయం తెలిసిందే.  జబర్ధస్త్ ని బీట్ చేసేందుకు ఎన్నో ఆ తరహా ప్రోగ్రామ్స్ వచ్చాయి.. కానీ ఏ ఒక్క ప్రోగ్రామ్ కూడా సక్సెస్ కాలేదు.  ఏడేళ్లుగా జబర్ధస్త్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కిట్స్ తో టీమ్ లీడర్లు అలరిస్తున్నారు. ముఖ్యంగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రాకెట్ రాఘవ లాంటి టీమ్ టీడర్లు తమదైన కామెడీ స్కిట్స్ తో పేరేడీ పంచ్ లతో అదరగొడుతున్నారు.  ఇక జబర్ధస్త్ స్పెషల్ ఎట్రాక్షన్ యాంకర్లు అనసూయ, రష్మి.  వారి హాట్ లుక్.. గిలిగింతలు పెట్టే మాటలు జబర్ధస్త్  కొత్త ఊపు తెస్తుంటాయి.  ఇదిలా ఉంటే ఇప్పుడు జబర్ధస్త్ నుంచి మెగా బ్రర్ నాగబాబు బయటకు వచ్చిన విషయం తెలిసిందే.  గత ఏడేళ్లుగా ఆయన జబర్ధస్త్  జడ్జీగా వ్యవహరిస్తున్నారు.  

 

ప్రస్తుతం జీ తెలుగులో ఆయన అదిరింది ప్రోగ్రామ్ కి జడ్జీగా వ్యవహరిస్తున్నారు.  అయితే జబర్ధస్త్ కాపీగా వస్తున్న ఈ కామెడీ ప్రోగ్రామ్ లో ఒకప్పుడు జబర్ధస్త్ తమదైన కామెడీతో నవ్వులు పూయించిన సీనియర్ వస్తున్నారు. వేణు, ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, ఆర్ పీ ఇలా అందరూ నాగాబాబు వెంట వచ్చేశారు.  అయితే అదిరింది కామెడీ షోకి యాంకర్ గా  బుల్లితెర నటి సమీర వ్యవహరిస్తున్నారు.  మొదటి వారం ఈ అమ్మడు కాస్త అమాయకంగా కనిపించినా.. ఇప్పుడు చాలా ఫాస్ట్ గా తన పంథా మార్చుకున్నట్లు కనిపిస్తుంది. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో పంచ్ డైలాగ్స్  డైలాగ్లు విసరటం మొదలు పెట్టింది.

 

తాజాగా అదిరింది ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో టీం లీడర్ చమ్మక్ చంద్ర స్కిట్ లో భార్య నటించిన ఓ యువతీ మనకి ఈ మగాళ్లు అవసరమా సమీరా అంటూ అడుగుతుంది. పడి ఉండనెయ్యే అప్పుడప్పుడూ ఉపయోగపడతారని పంచ్ డైలాగ్ వేస్తుంది యాంకర్ సమీర.  జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లో అనసూయ, రష్మీ లు అందాచాలను ఆరబోస్తూ మంచి క్రేజ్ లో ఉన్నారు. సమీరా కూడా వారి బాటలోనే నడుస్తున్నట్లు కనిపిస్తుంది. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: