టాలీవుడ్ సినిమా పరిశ్రమకి బాలనటుడిగా పరిచయం అయిన ఆలీ, చిన్నతనంలోనే పలు సినిమాల్లో నటించి తన ఆకట్టుకునే కామెడీ తో ప్రేక్షకులను ఎంతో అలరించారు. ఇక ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక పూర్తి స్థాయి కమెడియన్ గా మారి టాలీవుడ్ లో వందలాది సినిమాల్లో నటించిన ఆలీ, అనంతరం కొన్నాళ్ల తరువాత హీరోగా కూడా పలు విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక టాలీవుడ్ పరిశ్రమలో ఆలీ ఫ్యామిలీతో ఎందరో ప్రముఖులకు మంచి పరిచయాలు ఉన్నాయి. 

 

ఇకపోతే ఇటీవల ఆలీ తల్లి కొన్ని అనారోగ్య కారణాల వలన ఆకాల మరణం పొందిన విషయం తెలిసిందే .మెగాస్టార్ చిరంజీవి సహా, మరికొందరు సినిమా, రాజకీయ ప్రముఖులు ఆలీ తల్లి పార్థివదేహాన్ని దర్శించి ఆమె మృతికి నివాళులు అర్పించారు. అనంతరం కొందరు ఆయనను ఫోన్ లో పరామర్శించినట్లు తెలుస్తోంది. ఇకపోతే నేడు తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మణికొండలో ఆలీ స్వగృహానికి స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించడం జరిగింది. ఆలీ గారి ఫ్యామిలీతో తనకు మంచి అనుబంధం ఉందని, 

 

కేవలం నటుడిగానే కాక తన తోటివారికి ఏదైనా సమస్య వచ్చిందంటే చాలు, ముందుకు వచ్చి వీలైనంత సాయం అందించే ఆలీ గారి మాత్రమూర్తి హఠాత్తుగా ఇటీవల మరణించడం నిజంగా ఎంతో బాధాకరం అని, ఎక్కడ ఉన్నా ఆమె ఆత్మకు భగవంతుడు శాంతిని చేకూర్చాలని, అలానే ఆలీ గారి కుటుంబానికి తన తరపున ప్రగాఢ సానుభూతి తెల్పుతున్నట్లు మంత్రి తలసాని అన్నారు. ఇక ప్రస్తుతం అక్కడక్కడా కొన్ని సినిమాల్లో నటిస్తున్న ఆలీ, తల్లి హఠాన్మరణంతో సినిమాలకు కొంత విరామం ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే ఒకప్పటితో పోలిస్తే ఒకింత సినిమాలు చేయడం తగ్గించిన ఆలీ, ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: