ఏ ఇండ‌స్ట్రీలో అయినా చిన్న చిన్న కాంట్ర‌వ‌ర్సీలు రావ‌డం చాలా స‌హ‌జం. ఎప్పుడూ ఏదో ఒక టాపిక్‌తో 2019లో టాలీవుడ్‌ని హీటు పుట్టించిన మూడు అంశాలు గురించి చూద్దాం. 

`మా` కాంట్ర‌వ‌ర్సీ

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ (మా)లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్‌ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు గుట్టుగా కొట్టుకున్న వీళ్లు ఇప్పుడు బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆ మ‌ధ్య జ‌రిగిన‌ ‘మా’ సమావేశం తరవాత అసోసియేషన్ గురించి మీడియాలో పలు రకాల వార్తలు వచ్చాయి. అధ్యక్షుడు నరేష్‌కు జనరల్ సెక్రటరీ జీవితకు పడటం లేదని.. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రెండు వర్గాలుగా విడిపోయారని అన్నారు. దీనికి తోడు ఆ నాటి మీటింగ్‌కు అధ్యక్షుడు నరేష్ హాజరుకాకపోవడంతో మీడియా మరింత హైలైట్ చేసింది. మీటింగ్ ఎందుకు పెట్టుకున్నామో చెప్పారు. అదేరోజు సాయంత్రం అధ్యక్షుడు నరేష్ కూడా మీడియా ముందుకు వచ్చారు. అసలు అధ్యక్షుడితో సంబంధంలేకుండా పెట్టిన మీటింగ్‌కు తానెందుకు వెళ్తానని నరేష్ అన్నారు. అలాగే, 26 ఏళ్ల చరిత్ర కలిగిన ‘మా’ రాజ్యాంగాన్ని వీళ్లు మార్చడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది ‘మా’కు పెద్ద డ్యామేజీ అని కూడా వ్యాఖ్యానించారు. నరేష్ వ్యాఖ్యలపై ‘మా’ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కొంత మంది స్పందించారు. మీటింగ్‌లో కొన్ని కొన్ని మనస్పర్థలు, ఆర్గ్యూమెంట్స్ జరిగాయి కానీ.. అవి కూడా సామరస్యంగా పూర్తి అయ్యాయిని చెప్పారు. మా సభ్యులకు కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఉండటం వల్లే.. ఈ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నామని చెప్పుకొచ్చారు. అది ఒక నార్మల్ జనరల్ బాడీ మీటింగ్ మాత్రమే తప్పించి.. దీనికి కోర్టు పర్మిషన్లు ఏం అవసరం లేదని చెప్పుకొచ్చారు. అంతేగాక.. మాలో ఇప్పటివరకూ.. 1000 మంది సభ్యులు ఉన్నారని.. అందులో ఓ 20 పర్సెంట్ సభ్యుల ఆమోదం ఉంటే.. మీటింగ్ పెట్టుకోవచ్చని.. దీనికి కోర్టు పర్మిషన్ అవసరం లేదన్నారు. అలాగే.. మీటింగ్‌కు అటెండ్ కాని సభ్యులు కూడా.. మాతో ఫోన్‌లో టచ్‌ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే.. మాకు, అధ్యక్షుడు నరేష్‌కి మధ్య ఎటువంటి గొడవలు జరగలేదని తెలిపారు.

 

ప్రొడ్యూస‌ర్ బ‌న్నీవాసు ఇష్యూ
నిర్మాత బన్నీవాసు తనకు సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారంటూ ఫిల్మ్ ఛాంబర్ వద్ద నిరసనకు దిగిన జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బన్నీ వాసు. బోయ‌సునీత‌ నేను జనసేనలో పనిచేస్తున్నా నాకు ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి అని మమ్మల్ని అప్రోజ్ అయ్యింది. మేం కూడా ఆమెకు ఏదైనా చూడమని మా గీతా ఆర్ట్స్ వాళ్లకు చెప్పాం. కాని ఇక్కడ సునీత బోయ తెలుసుకోవాల్సింది. నువ్ జనసేనలో పనిచేశావని క్యారెక్టర్ ఇవ్వమనడం కరెక్ట్ కాదు. మెగా హీరోలను అభిమానిస్తావు.. మీ నాన్న మాకు తెలిసిన థియేటర్స్‌లో పనిచేశారు కాబట్టి ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వమని చెప్పా. మా వాళ్లు కూడా నీకు ఆడిషన్స్ చేశారు. నువ్ వెళ్లావని చెప్పావు. అన్న వాద‌న‌లు ఇద్ద‌రి వైపు వ‌చ్చాయి. 

 

 శ్రీ‌రెడ్డి  హీరో విశాల్ ఇష్యూ
శ్రీరెడ్డి... ఈ పేరు చెబితే చాలు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో చాలామందికి వెన్నులో వణుకుపుడుతుంది. ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్లుగా వెలుగొందుతున్న చాలా మందిపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి తెలుగు హీరోలతో పాటు  తమిళ తంబీల వెన్నులో వణుకు పుట్టించింది. అవకాశాలు ఇస్తామని నమ్మించి, తనను లైంగికంగా వాడుకున్నారని ఆరోపణలు చేసింది.తెలుగు సినీ పరిశ్రమలో తెర వెనుక జరుగుతున్న లైంగిక బాగోతంపై గళం విప్పి ఒక్కసారిగా మీడియా దృష్టిని ఆకర్షించింది శ్రీరెడ్డి. ఈమె మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, రాఘవ లారెన్స్ పై   లైంగిక ఆరోపణలు చేసింది. ప్రస్తుతం చెన్నై లో మకాం పెట్టిన శ్రీరెడ్డి.. తాజాగా ప్రముఖ తమిళ హీరో విశాల్ ను టార్గెట్ చేసింది. వివరాల్లోకి వెళితే..త్వరలో జరగనున్న నడిగర్ సంఘం ఎన్నికల నేపథ్యంలో ఏ కారణం లేకుండానే విశాల్ ను టార్గెట్ చేస్తూ... తన సోషల్ మీడియా ద్వారా విమర్శలకు దిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: