బాలీవుడ్ లో ఈ సంవత్సరం ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి.. ఎందరో కొత్త కొత్త దర్శకులు, నటీనటులు, రచయతలు ఇలా ఎంతో మంది వచ్చారు. అలానే సంగీత దర్శకులు కూడా ఎందరో వచ్చారు. అయితే ఆలా వచ్చిన దర్శకులు ఎంతో కొత్త కొత్త సాంగ్స్.. ఢిల్లీ నుండి ఆంధ్రలో గల్లీల్లో ఉన్నవారి వరుకు ప్రతి ఒక్కరి నోటా బాలీవుడ్ పాట వచ్చేలా చేశారు. అయితే అందులో టాప్ 5 పాటలు ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. 

 

యాద్ పియా కి అనే లాగి అనే సాంగ్ బాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఈ సాంగ్ ని ఫాల్గుణి పథక్ అనే సింగర్ పాడాడు. ఈ సాంగ్ కి ఎంతో పాపులారిటీ వచ్చింది. ఈ సాంగ్ ఒకానొక సమయంలో ట్రెండ్ కూడా అయ్యింది. 

 

బాలీవుడ్ లేడీ డాన్ కంగనా రనౌత్, రాజ్కుమార్ రావు ప్రధాన పాత్రల్లో నటించిన జడ్జిమెంటల్ హై క్యా లో ది వక్ర సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఈ సాంగ్ వింటే ఎవరైనా సరే డ్యాన్స్ చేస్తారు. అంతటి సూపర్ హిట్ సాంగ్ ఇది. 

 

ఆయుష్మాన్ ఖుర్రన, యామి గౌతమ్ నటించిన ఈ సినిమాలో సాంగ్ మనసు హత్తుకుంటుంది. సినిమా సాంగ్ సింపుల్ మ్యూజిక్ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా సాంగ్ కూడా ఒక రేంజ్ లో హిట్ అయ్యింది. 

 

గల్లి బాయ్ నుండి వచ్చిన సాంగ్.. అప్నా టైం ఆయేగా. ఈ సాంగ్ కు ఒక్క బాలీవుడ్ ప్రేక్షకులే కాదు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆకర్షితులు అయ్యారు. అంత అద్భుతంగా ఆ సాంగ్ ఉంది. ఒక్క ప్రేక్షకులే కాదు సెంట్రల్ మినిస్టర్ సైతం అప్నా టైం ఆయెగా అంటూ ట్విట్ చేసి అప్పట్లో సంచలనం సృష్టించారు.  

 

కోకో కోల అనే సాంగ్ బాలీవుడ్ లో ఓ ఊపు ఊపింది. పంజాబీ నుండి ఈ సాంగ్ ని రీమేక్ చేసినప్పటికీ సినిమా సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. బాలీవుడ్ టాప్ 5 లో నిలించింది. చూశారుగా.. ఈ సాంగ్స్ బాలీవుడ్ లో ఓ రేంజ్ లో సూపర్ హిట్ అయ్యాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ సాంగ్స్ వినండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: