కోలీవుడ్ లో భారీ సినిమాల రిలీజ్ టైంలో ఏదొక వివాదం నెలకొంటూనే ఉంటుంది. కాపీ ఆరోపణలు, ఆర్ధిక సమస్యలు ఇలా ఏదొక సమస్య వస్తూనే ఉంది. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న 'దర్బార్' సినిమా విషయంలో కూడా ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి.ఈ చిత్ర నిర్మాణ సంస్థ గత చిత్రం కోసం చేసిన అప్పుల కారణంగా 'దర్బార్' సినిమా ఇబ్బందుల్లో పడింది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన 'దర్బార్' సినిమాను పొంగల్ కానుకగా జనవరి 9న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. దర్భార్ సినిమాని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. నిర్మాణ సంస్థ కారణంగా ఇప్పుడు సినిమా రిలీజ్ కి అడ్డంకులు ఎదురవుతున్నాయి.

 

గతంలో రజినీకాంత్ నటించిన '2.ఓ' సినిమాని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. అప్పట్లో 2.0 మూవీ రిలీజ్ కావడానికి కూడా ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి.. ప్రతిసారి పోస్ట్ పోన్ అవుతూ ఒకదశలో సినిమా రిలీజ్ అవుతుందా అన్న అనుమానాలు కూడా వచ్చాయి.  ఇప్పుడు ఈ మూవీ ఎఫెక్ట్ ‘దర్భార్’ పై పడిందని అంటున్నారు కోలీవుడ్ వర్గాలు.  2.0 మూవీ తీస్తున్న  సమయంలో మలేషియాకి చెందిన ఎంటర్‌టైన్మెంట్‌ కంపెనీ డీఎంవై క్రియేషన్స్‌ నుండి రూ.12 కోట్లను అప్పుగా తీసుకుంది.ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో ఇప్పుడు వడ్డీతో కలిపి రూ.23 కోట్ల 70 లక్షలు అయింది.

 

ఆ మొత్తాన్ని చెల్లించే వరకు 'దర్బార్' సినిమా రిలీజ్ ఆపాలాంటూ డీఎంవై సంస్థ హైకోర్టుని ఆశ్రయించింది. దీంతో ఈ పిటిషన్ పై స్పందిన్చాలంటూ మద్రాస్ హైకోర్టు లైకా ప్రొడక్షన్స్ కి నోటీసులు పంపింది. ఇప్పటికే ఈ మూవీ పై భారీ అంచనాలు పెంచుకున్నారు చిత్ర యూనిట్. అంతే కాదు తమ అభిమాన హీరోని పోలీస్ అధికారిగా చూస్తామనుకుంటున్న రజినీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ఇది షాకింగ్ న్యూస్ అంటున్నారు కోలీవుడ్ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: