అక్కినేని హీరోలతో వరుసగా రెండు సినిమాలు చేసింది పక్కా హైదరాబాద్ బ్యూటీ నిధి అగర్వాల్. కానీ ఆ రెండు సినిమాలు ఘోర పరాజయాన్ని చూశాయి. నాగ చైతన్య సవ్యసాచి, అఖిల్ మిస్టర్ మజ్ఞు సినిమాలలో నటించి ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ రెండు తేడా కొట్టాయి. దాంతో సర్ధుకుందామని అనుకుంటున్న సమయంలో పూరి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు. రీసెంట్‌గా ఎనర్జిటిక్ పూరి తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' బ్లాక్ బస్టర్ అయినా కానీ.. నిధికి టాలీవుడ్ లో ఆ సినిమాతో ఒరిగిందేమి లేదు. ఇలా ఎందుకు జరిగిందో అని నిధి గిల గిలా కొట్టేసుకుంటుందట. ప్రస్తుతం నిధి మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ సరసన నాయికగా నటిస్తోంది. రెమ్యూనరేషన్ కూడా బాగానే ముడుతోందట. అయినా ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ బ్యూటి పేరు వినిపించడంలేదు. అంటే.. అందుకు ఓ సర్ ప్రైజింగ్ రీజన్ పరిశ్రమలో వినిపిస్తోంది. 

 

నిధుకి అందానికి అందం కాస్తో కూస్తో ట్యాలెంట్ ఉన్నా ఎందుకనో నిధికి పెద్ద హీరోల సరసన ఆఫర్లు ఏవీ రాలేదు. మరోవైపు హిందీ చిత్రసీమలోనూ ఈ అమ్మడి కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది. అక్కడ టైగర్ ష్రాఫ్ తో స్నేహం కూడా తనకు ఏమాత్రం కలిసి రావడం లేదు. బాలీవుడ్ లో పెట్టుకున్న ఆశలు అంతేగా ఉన్నాయి. మొత్తానికి కారణం ఏదైనా ప్రస్తుతం నిధి టెన్షన్స్ లో ఉందట.

 

హైదరాబాద్ కి చెందిన ఈ అమ్మడు బెంగళూరు ర్యాంప్ ని ఇరగదీసింది. ఆ తర్వాత ముంబై ఫ్యాషన్ ఇండస్ట్రీలోనూ పాపులరైంది. అందాల పోటీల్లోనూ నిధి టాప్ స్లాట్ లో రాణించింది. టాలీవుడ్ బాలీవుడ్ లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి ఇప్పుడు పూర్తిగా తగ్గిపోవడం నిధికి షాకిస్తోంది. ఆ మధ్య మెగా కాంపౌండ్ లో ఎంటరైందని నిధి కి ఇక తిరుగులెవదని చెప్పుకున్నారు. కానీ ఆ తర్వాత దాని ఊసే లేదు. కరెక్ట్ గా చెప్పాలంటే ఒక రకంగా నిధిని రిజెక్ట్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇందుకు కారణమేమిటి? అంటే.. మెరుపుతీగలాంటి ఈ అమ్మడు ఇటీవల కాస్త బొద్దుగా తయారైందట. అది కూడా తమిళ పరిశ్రమలో రాణించేందుకు ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. అయితే బొద్దెక్కడం వల్లనే నిధికి ఛాన్సులు రావడం లేదా?  లేక ఇంకేదైనా కారణమా? అన్నది తనే చెప్పాల్సి ఉంటుంది. అయితే కొంతమంది మాత్రం నిధికి కి అసలు యాంక్టింగే రాదు ..హీరోయిన్ ఎలా అయిందని కామెంట్స్ చేస్తున్నారట. ఏ సీన్ లో చూసినా తేలిపోయినట్టు కనిపిస్తుందని సాంగ్స్ లో కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతోందని అంటున్నారు. మరి ఇది ఎలా తీసుకుంటుందో నిధి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: