తెలుగు సినిమా రంగంలో చాలామంది పెద్ద పెద్ద స్టార్ హీరోలు తమ ఇమేజ్ మరియు క్రేజీ కి తగ్గ డైరెక్టర్ల తోనే పని చేస్తారని నానుడి ఉంది. డైరెక్టర్ కి ఎంత టాలెంట్ ఉన్నాగాని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు ఏమాత్రం వాళ్ళతో పని చేయడానికి వారికి అవకాశం ఇవ్వడానికి అసలు ముందుకు రారని మిగతా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఎక్కువగా టాలీవుడ్ ఇండస్ట్రీపై ఇండస్ట్రీ లో ఉండే స్టార్ హీరోలపై కామెంట్లు చేస్తుంటారు. ప్రస్తుతం చాలా మంది కొత్త కొత్త డైరెక్టర్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ బడ్జెట్లోనే పెద్ద పెద్ద లాభాలు తెచ్చే విధంగా సినిమాలు చేస్తూ సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్నారు.

 

ప్రస్తుత జనరేషన్ కి తగ్గ రీతిలో సినిమా స్టోరీ లు క్రియేట్ చేస్తూ చాలామంది చిన్న డైరెక్టర్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రికార్డులు సృష్టిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గతంలో మాదిరి కాకుండా ఈ ఏడాది పెద్ద హీరోలు చిన్న డైరెక్టర్ లకి ఛాన్స్ ఇవ్వడం లేదు అన్న ముద్ర తమపై పడకుండా యంగ్ టాలెంట్ ని కూడా ప్రోత్సహించాలని చాలామంది కోరుతున్నారు. కేర్ ఆఫ్ కంచరపాలెం, పెళ్లి చూపులు లాంటి సినిమా లు వచ్చిన స్టార్ హీరో లు వాళ్ళని పట్టించుకోవడం లేదు .. ఇమేజ్ చట్రం  లో ఇరుక్కుపోయారు.

 

స్టార్ హీరోలు టాలెంట్ ని ప్రోత్సహిస్తే ఖచ్చితంగా ఇండస్ట్రీలో రాణించాలని చూస్తున్న చాలా మంది డైరెక్టర్లు వారికి లైఫ్ ఇచ్చినట్టు అవుతుందని కనుక ఈ సంవత్సరం నుండి కొత్త టాలెంట్ కి కూడా సరికొత్త అవకాశాలు స్టార్ హీరోలు ఇస్తే ప్రేక్షకులను మరియు ఇండస్ట్రీలో కొత్త వాళ్ళకి అలరించినటు అవుతుందని చాలా మంది సినిమా ప్రేమికులు కోరుతున్నారు. కొత్త టాలెంట్ ని కొత్త డైరెక్టర్ లకి...కేవలం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలు ఎక్కువ అవకాశాలు ఇవ్వరూ రానివ్వరు అన్న ముద్ర ఇతర ఇండస్ట్రీలో నాటుకుపోయింది వాటిని ఈ ఏడాది కంటిన్యూ కాకుండా చూసుకోవాలని చాలామంది కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: