టాలీవుడ్, బాలీవుడ్ లో తనదైన సినిమాలతో ఎన్నో కాంట్రవర్సీలు, కామెడీలు సృష్టించిన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ బాలీవుడ్ నుంచి పూర్తిగా టాలీవుడ్ కి వచ్చారు.  ఇక్కడ ఆయన తెరకెక్కిస్తున్న సినిమాలకు పెద్దగా ఆదరణ రాలేదు.  ఆ మద్య శివ గర్వాత చాలా ఏళ్లు గ్యాప్ తీసుకొని ఆఫీసర్ మూవీ తీశారు.  ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.  ఆ తర్వాత బయోపిక్ మూవీలపై కన్నేసిన వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ తీశారు.  అదే సమయానికి ఏపిలో ఎన్నికలు రావడం.. ఈ మూవీ ప్రభావం అప్పటి అధికార పార్టీ టీడీపీ పైడుతుందని అభ్యంతరాలు రావడం జరిగింది. దాంతో ఈ మూవీని ఈసీ నిలిపివేసింది.. కానీ అప్పటికే ఇతర రాష్ట్రాల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ అయ్యింది.  తర్వాత మరికొన్ని సినిమాలు తీసినా వర్మ రీసెంట్ గా ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ అనే సినిమాతో వచ్చారు.  

 

ఈ మూవీలో ఏపి రాజకీయల నేపథ్యంలో అచ్చం అయా క్యారెక్టర్లకు తగ్గ ముఖాలతో తెరకెక్కించారు.  ఈ మూవీపై కూడా ఎన్నో విమర్శలు వచ్చినా మొత్తాని రిలీజ్ అయ్యింది.  కానీ సక్సెస్ మాత్రం సాధించలేక పోయింది.  అయితే గత కొంత కాలంగా వర్మ జనసేన నేత పవన్ కళ్యాన్ ని టార్గెట్ చేసుకొని ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు.  తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు దర్శకుడు రాంగోపాల్ వర్మ క్షమాపణలు తెలిపారు. తనకు శ్రీదేవి కంటే పవన్ కల్యాణ్ అంటేనే ఇష్టమని పేర్కొన్న వర్మ.. తనను క్షమించాలని వేడుకున్నారు.

 

రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘బ్యూటిఫుల్’ సినిమా నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రి న్యూ ఇయర్ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. గతంలో పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు. పవన్ గొప్ప నటుడు.. ఆయనకు ఓ తిక్కుందని, లెక్క కంటే తిక్కే అందరికీ ఎక్కువగా నచ్చుతుందని పేర్కొన్నారు. ఆయన అందుకే సూపర్ స్టార్ అయ్యాడన్నారు. ‘పవన్ గారూ.. నన్ను క్షమించండి’ అని కోరారు.  తాను దేవుడ్ని నమ్మనని, తన మాటలను నమ్మకపోతే ఏమీ చేయలేనని వర్మ స్పష్టం చేశారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: