నా పేరు సూర్య తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న సినిమా అల వైకుంఠపురములో. త్రివిక్రం డైరక్షన్ లో హ్యాట్రిక్ కాంబోగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే తారాస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది. సినిమాకు థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే అల వైకుంఠపురములో సాంగ్స్ తెలుగు రెండు రాష్ట్రాల సంగీత ప్రియులను అలరిస్తున్నాయి.

 

ఇక ఈ సినిమా నుండి వచ్చిన మొదటి సాంగ్ సామజవరగమన. సిద్ శ్రీరాం ఆలపించిన ఈ సాంగ్ ను సిరివెన్నెల సీతారమశాస్త్రి రచించారు. సాంగ్ ప్రోమో నుండే సెన్సేషనల్ అయిన ఈ సాంగ్ వీడియో ప్రోమో న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ చూసిన మెగా ఫ్యాన్స్ ఈ సంవత్సరం మొదటి బ్లాక్ బస్టర్ బన్ని కొట్టేస్తున్నాడని సంబరపడుతున్నారు. త్రివిక్రం మాటలు.. థమన్ మ్యూజిక్.. బన్ని డ్యాన్స్.. పూజా అందాలు వీటన్నిటికి తోడైన కథ, కథనాలు అల వైకుంఠపురములో సినిమా పక్కా హిట్ అని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలని అంటున్నారు మెగా అల్లు ఫ్యాన్స్.

 

సినిమా నుండి రిలీజైన ప్రతిది సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుంది. అయితే ఈ అంచనాలకు తగినట్టుగా సినిమా ఉంటే మాత్రం అల్లు అర్జున్ మరోసారి రికార్డుల వేట మొదలు పెట్టినట్టే. ఈ సంక్రాంతికి కానుకగా జనవరి 12న ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ ఈ సినిమాను జనవరి 10కి ప్రీ పోన్ చేసే ఆలోచనలో ఉన్నాడట. మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 11న రిలీజ్ ఫిక్స్ చేశారు. సంక్రాంతి పందెంకోళ్లుగా మహేష్ అల్లు అర్జున్ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారు. మరి ఈ రేసులో విజయ పతాకం ఎగురవేసేది ఎవరో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: