ప్రస్తుతం టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీంగా అలానే, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ

 

సముద్ర ఖని, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమాలోని విలన్ పాత్రధారులు ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేసిన సినిమా యూనిట్, ఇప్పటివరకు సినిమా ఫుల్ టైటిల్ కానీ, ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్ కానీ రిలీజ్ చేయలేదు. అయితే నిన్న ఈ సినిమాకు సంబందించిన అప్ డేట్స్ కావాలంటూ ఒక అభిమాని ట్విట్టర్లో చేసిన ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ, తప్పకుండా, మేము కూడా ఆ పనిలోనే ఉన్నాం అని తెల్పిన ఆర్ఆర్ ఆర్ యూనిట్, నేడు ఆశ్చర్యకరంగా తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఫ్యాన్స్ కి, ఇది ఆర్ఆర్ఆర్ నామ సంవత్సరం అంటూ కేవలం న్యూ ఇయర్ విషెస్ మాత్రమే చెప్పడంతో పలువురు ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. 

 

సినిమా దాదాపుగా పూర్తి కావస్తున్నప్పటికీ కూడా ఆర్ఆర్ఆర్ టీమ్ ఇప్పటివరకు హీరోలిద్దరి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయకపోవడం ఏంటని, నిన్నటినుండి మీనుండి అప్ డేట్ ఆశించిన మమ్మల్ని మీరు మోసం చేసారు. ఇక ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఇతర సినిమాల వాళ్ళు తమ సినిమాలకు సంబందించిన అప్ డేట్స్ ఇస్తుంటే, మీరు మాత్రం జస్ట్ విషెస్ మాత్రమే చెప్పి ఎప్పటివలె తప్పించుకోవడం దారుణం అని, కావున ఇకనైనా దర్శకుడు రాజమౌళిసినిమా అప్ డేట్స్ ఇస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. మరి వారి కామెంట్స్ పై ఆర్ఆర్ఆర్ టీమ్ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: