ఈ మాటలు అంటుంది ఎవరో కాదు అల్లు అర్జున్ అత్యంత సన్నిహితుడు..  నిర్మాత బన్నీ వాసు. మొదటి నుంచి అల్లు అర్జున్ కి బన్ని వాసు కి మద్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. బన్ని ముద్దు పేరునే తన ఇంటిపేరుగా మార్చుకొని బన్ని వాసుగా చెలామణి అవుతున్నాడు.  అల్లు అర్జున్ ఏం సినిమా తీయాలనుకున్నా ముందుగా తన స్నేహితుడు  బన్ని వాసుని తప్పకుండా సంప్రదించేవాడట. వీరిద్దరు మూవీ పై చర్చించుకున్న తర్వాత కథ ఓకే అంటే అల్లు అర్జున ఆ మూవీలో నటించేవాడని ఫిలిమ్ వర్గాల్లో టాక్. లాంటిది అంత మంచి స్నేహితుడి కారణంగా అల్లుఅర్జున్ పెద్ద డిజాస్టర్నే మూటగట్టుకున్నాడు.

 

సినిమా మరేదో కాదు అల్లుఅర్జున్ హీరోగా వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.  నివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘నా పేరు సూర్య’ మూవీ దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కించారు.  ఈ మూవీలో అల్లు అర్జున్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది.  అయితే ఈ సినిమా కథ విన్నప్పటి నుంచి అల్లుఅర్జున్ కు ఎక్కడో తేడా అనిపిస్తుందని పదే పదే చెప్తుండే వాడ ట కానీ బన్నీ వాసు మాత్రం ఈ సినిమా బాగుంటుందని.. నీ పర్సనాలిటికీ.. ఆవేశానికి ఈ సినిమా చాలా బాగుంటుందని అన్నాను. అలా చెప్పటంతో బన్నీ సినిమా చెయ్యక తప్పలేదట.

 

బన్నీ వాసు మాటలను నమ్మి అల్లుఅర్జున్ ఆ సినిమా చేసి బోర్లా పడ్డాడు.  అయితే సినీ పరిశ్రమలో నేను నిర్మాతగా మారి కాస్త బిజీ అవ్వడంతో బన్నీని కలుసుకోలేక పోతున్నానని అన్నారు. అయితే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ కావటంతో అల్లుఅరవింద్ పిలిచి పట్టు తప్పుతున్నావ్ అని మంద లించారట. బన్నీకి నాకు వచ్చిన  ఆ గ్యాప్ వల్లే ఫ్లాప్ చూడాల్సి వచ్చింది.  నెక్స్ట్ సినిమాకి గ్యాప్ కూడా తనవల్లే ఏర్పడిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు బన్నీ వాసు.

మరింత సమాచారం తెలుసుకోండి: