సీనియర్ నటుడు చలపతిరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నటుడు రవిబాబు. కేవలం నటుడుగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘అల్లరి’ సినిమాతో దర్శకుడిగా మారి మొదటి సినిమాతోనే తన మార్కును, స్టైల్ ని చూపించారు. ఆ తరవాత ‘నచ్చావులే’ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. కేవలం ఒకే జోనర్‌లో కాకుండా రవిబాబు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. వాటిలో కొన్ని వర్కౌట్ అవుతున్నాయి. కొన్ని షాకిస్తున్నాయి.

 

‘అల్లరి’, ‘నచ్చావులే’ సినిమాలతో కడుపుబ్బా నవ్వించిన రవిబాబు.. ‘అన‌సూయ‌’, ‘అమ‌రావ‌తి’, ‘అవును’, ‘అవును 2’ వంటి హారర్ సినిమాలతో భయపెట్టారు. ఆఖరికి పందిని ప్రధాన పాత్రగా పెట్టి ‘అదుగో’ అనే సినిమాను చేశారు. ఇక రీసెంట్‌గా  దిల్ రాజుతో కలిసి ఇటీవల ‘ఆవిరి’ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ రెండు సినిమాలు ఘోరంగా విఫలమయ్యాయి. అయితే, ఇప్పుడు మరో సినిమాను ప్రకటించారు రవిబాబు. సినిమా టైటిల్ ‘క్రష్’ అట.

 

తన సొంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్‌పై తన దర్శకత్వంలో ర‌విబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొత్త సంవత్సరం సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ లుక్‌ను విడుదల చేశారు. ఈ టైటిల్ పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా యువతను టార్గెట్ చేస్తూ తీస్తున్నట్టు అర్థమవుతోంది. అంతేకాదు ఇది కంప్లీట్ అడల్ట్ మూవీ అని తెలుస్తోంది. సక్సస్ లేక ఇలాంటి సినిమాని తీయాలని డిసైడైనట్టుగా అనిపిస్తోంది. బికినీలో ఒక అమ్మాయి బీచ్‌లో నడుస్తూ వస్తుంటే ముగ్గురు కుర్రాళ్లు ఆమెను చూసి వేడిపుట్టి ఏదో అయిపోతున్నట్టుగా పోస్టర్‌లో చూపించారు. మొత్తం మీద రవిబాబు గత సినిమాలతో సంబంధం లేకుండా మరో కొత్త జోనర్‌ను రవిబాబు సెలెక్ట్ చేసుకున్నాడనిపిస్తుంది.

 

రొమాంటిక్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా జ‌న‌వ‌రి 24 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ మొదలవబోతోందట. అలాగే, సినిమాను సమ్మర్ లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. త్వర‌లోనే సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్రక‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ వెల్లడించింది.                  

మరింత సమాచారం తెలుసుకోండి: