అల్లు అర్జున్ అంటే నేటి యువతకు ఎంత క్రేజో అందరికి తెలిసిందే. ఆయన డ్యాన్స్, ఫైట్స్ ఇలా దేనికదే ప్రత్యేకత కలిగిన హీరో. ఇకపోతే అలవైకుంఠపురంలో చిత్రం తర్వాత బన్నీ చేయబోతున్న సినిమా ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బన్నీ అభిమానులైతే 2019 లో అల్లు అర్జున్ సినిమా మిస్సెయ్యాం అని తెగ ఫీలై పోతున్నారట. ఈ క్రమంలో ఈ అల్లువారి అబ్బాయి తన అభిమానులకు 2020 లో స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడట. ఈ వార్తవిన్న అభిమానులు కుషీ కుషిగా చిందులేయడం గ్యారంటీ అంటున్నారు.

 

 

ఇక గత ఏడాది అంటే 2018 లో వచ్చిన మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్‌ ఆ సినిమా ఫ్లాప్‌తో చాలా గ్యాప్‌ తీసుకున్నాడు. అంటే దాదాపుగా సంవత్సరంకు పైగా వెయిట్‌ చేసి చివరకు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమాను పూర్తి చేసి ఈ సంక్రాంతి బరిలో ఉన్నాడు.  ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మంచి ఊపు మీదున్నాడు అని అనుకోక తప్పదు. ఎందుకంటే అల వైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ సినిమాను ఓకే చేసిన విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. షూటింగ్ కూడా త్వరలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

 

అంటే ఈ సంవత్సరం 2020లో అల్లు అర్జున్ నటించిన రెండు సినిమాలు విడుదలవడం కావడం ఖాయం..  అయితే ఈ రెండు సినిమాలే కాక బన్నీ మూడవ సినిమాను కూడా ఓకే చేసినట్లు సన్నిహిత వర్గాల ద్వార తెలుస్తుంది.. ఆ లైనప్ కూడా చాలా ఆసక్తికరంగా ఉండడంతో బన్నీ ఫ్యాన్స్ కు పండగ మొదలైందంటున్నారు.  

 

 

ఇక ఈ సినిమాలకు సంబంధించిన ప్రకటనలు ఆయా సమయాల్లో జరిగేలా అల్లు అర్జున్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడని సినీవర్గాల గుసగుసలట. ఇకపోతే అల్లు అర్జున్ స్పీడ్ 2020 లో మామూలుగా లేదని తెలుస్తుంది. ఇక చూద్దాం ఈ సంవత్సరం బన్నీ ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తారో.. 

మరింత సమాచారం తెలుసుకోండి: