బుల్లితెర మీద ఎప్పుడూ తన అల్లరితో యాంకరింగ్ చేస్తూ అలరిస్తూ వచ్చిన శ్రీముఖి కొన్నాళ్లుగా స్మాల్ స్క్రీన్ పై కనిపించడం లేదు. ఈటివిలో పటాస్ షోతో బాగా పాపులర్ అయిన శ్రీముఖి బిగ్ బాస్ ఛాన్స్ రాగానే పటాస్ ను వదిలి వెళ్లింది. షో వదిలిపెట్టి బిగ్ బాస్ కు వచ్చినందుకు శ్రీముఖికి మంచి రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ విన్నర్ అవుతుందని అనుకున్న శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది.

 

రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విజేత కాగా శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3 లో టాప్ 2 ప్లేస్ లో నిలిచింది. అయితే బిగ్ బాస్ కు వెళ్లకముందే శ్రీముఖికి సూపర్ క్రేజ్ ఉంది. కొత్తగా రావాల్సిన క్రేజ్ ఏమి లేదు. అయితే బిగ్ బాస్ తర్వాత శ్రీముఖి మరింత బిజీ అవుతుందని అనుకుంటే అంతకుముందున్న ఫాం కాస్త కోల్పోయిందని తెలుస్తుంది.

 

ముఖ్యంగా బిగ్ బాస్ షో పూర్తయి చాలా రోజులవుతుండగా వేరే షో స్టార్ట్ చేయలేదు. ఎప్పుడూ స్మాల్ స్క్రీన్ పై సందడి చేసే శ్రీముఖి ఈమధ్య కనిపించడం లేదు. టివి ఆన్ చేస్తే ఏదో ఒక ఛానెల్ లో తన యాంకరింగ్ తో అలరించే శ్రీముఖి ఇప్పుడు కనుమరుగైంది. శ్రీముఖి ఫ్యాన్స్ కూడా ఆమె షో కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వేర్ ఈజ్ శ్రీముఖి అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

 

శ్రీముఖి మాత్రం ఇంకా హాలీడేస్ లోనే ఉంది. ఈమధ్య బిగ్ బాస్ కంటెస్టంట్స్ తో చేసిన షోలో మెరిసిన శ్రీముఖి ఓ కొత్త షోతో వస్తుందని చెప్పింది. శ్రీముఖి కొత్త షో కోసం బుల్లితెర ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అమ్మడు మాత్రం ఫోటో షూట్స్ తో హంగామా చేస్తుంది. కొత్త సంవత్సరం శ్రీముఖి ఎలాంటి సరికొత్త షోతో వస్తుందో చూడాలి.     

మరింత సమాచారం తెలుసుకోండి: