మెగాస్టార్‌ చిరంజీవి అంటే ఓ సంచలనం. పిచ్చి పిచ్చిగా ప్రేమించే ఫాన్స్‌ కోసం ఆయన ప్రత్యేక శ్రద్దతో డాన్స్‌లు ఇరగదీస్తాడు అనే పేరు ఉంది.. చిరుతో డ్యాన్స్ చేయాలంటే హీరోయిన్స్ కాస్త ఇబ్బంది పడతారనేది అందరికి తెలిసిన విషయమే. చిరుకు వయస్సు పై బడిన తన నటనలో, డ్యాన్స్ లో ఏ మాత్రం వాడి తగ్గలేదని ఇప్పటికి నిరుపిస్తున్నాడు.

 

 

ఇకపోతే ఖైదీ సినిమా సృష్టించిన ప్రభంజనం అందరికి తెలిసిందే. ఆ తర్వాత “సైరా నరసింహారెడ్డి” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరుకి ఈ చిత్రంలోని పాత్ర తన జీవితంలో సంతృప్తినిచ్చిందని తెలియచేసారు. ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించారు. ఇకపోతే ఇప్పుడు తాజాగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం లో మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.  ఇక లేటెస్ట్ స‌మాచారం ప్రకారం చిరు సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్ ఉంద‌ట‌. ఆ సాంగ్‌లో న‌టించాల‌ని హీరోయిన్ రెజీనా క‌సండ్ర‌ను చిత్ర యూనిట్ సంప్ర‌దించిందట. అయితే నిన్నటి వరకు ఈ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌డానికి రెజీనా నో చెప్పేసింద‌ని వార్త‌లు వినిపించాయి.

 

 

కానీ తాజా సమాచారం ప్రకారం రెజీనా ఐటెం సాంగ్ కు ఒప్పుకుందని తెలుస్తుంది. ఇక ఇందుకు రెజీనా తీసుకునే రెమ్యూనరేషన్ సంగతి అలా పక్కన పెడితే.. అసలు చిరుతో డ్యాన్స్‌ చేసే ఛాన్స్‌ రావటంతో రెజీనా కూడా వెంటనే ఒప్పేసుకుంది. అయితే గతంలో చిరు ఖైదీ నంబర్‌ 150 షూటింగ్ సమయంలో కూడా ఇలాంటి రూమర్సే వినిపించాయి. ఆ సినిమాలో రెజీనా స్పెషల్ సాంగ్ చేస్తుందన్న ప్రచారం గట్టిగా జరిగింది కానీ ఫైనల్‌గా ఆ అవకాశం రాయ్‌ లక్ష్మీని వరించింది.

 

 

మరి ఇప్పుడైనా రెజీనా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందో లేదో చూడాలి. ఇక చిరు 152 వ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థతో కలిసి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై నిర్మిస్తుండగా, చిరు సరసన త్రిష ను ఎంపిక చేశారు. అదీ కాకుండా చాలా కాలం తరువాత మణిశర్మ, మెగాస్టార్‌ చిత్రానికి సంగీతమందించడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: