హార్ట్ ఎటాక్ కొత్త టీజర్ వదిలారు పూరిజగన్నాథ్ దర్శకత్వం లో నితిన్, ఆదా శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా హార్ట్ ఎటాక్ టైటిల్ తోనే మార్కెట్ ని తన వైపుకి తిప్పుకునే పూరి ఈ సినిమాను పూరి టూరింగ్ టాకీస్ అనే తన సొంత నిర్మాణ సంస్థ నుండే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. తన ప్రొడక్షన్ నుండి వస్తున్న సినిమా కాబట్టి పూరి హార్ట్ ఎటాక్ గురించి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడట. ఇక వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదున్న నితిన్ కూడా ఈ సినిమాను ఎలాగైనా హిట్ చేసుకుని హ్యాట్రిక్ హిట్ కొట్టాలని  అనుకుంటున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసి యూత్ ని ఎట్రాక్ట్ చేశాడు పూరి మరళ కొత్త సంవత్సరం కానుకగా మరో టీజర్ ని రిలీజ్ చేశాడు డైరక్టర్ కం ప్రొడ్యూసర్ పూరి జగన్నాథ్. ఈ టీజర్ కూడా సూపర్ గా ఉండట ఈ సినిమాతో మరోసారి తన కలానికి ఎక్కువ పని చెప్పాడట. ముఖ్యం గా డైలాగ్స్ విషయంలో సూపర్ ట్రాక్స్ ని రాస్తున్నాడట పూరి.  సో ఈ సినిమా సక్సెస్ అటు పూరి కి ఇటు నితిన్ కి చాలా అవసరం కాబట్టి వారిద్దరు తమ తమ పరిది మేరకు చాలా కష్టపడుతున్నారట. ఆల్రెడీ పూరి రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ లో కొంచం డిఫరెంట్ గా కొటేషన్స్ పెట్టి ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాడు . ఇక సినిమా మాత్రం జనవరి చివరన థియేటర్స్ లో సందడి చేయనుంది.. సో చూద్దాం నితిన్ సక్సెస్ ఫాం కొనసాగిస్తాడా లేదా అనేది సినిమా రిలీజ్ అయ్యాక కాని తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: