ఆర్.ఆర్.ఆర్ గురించి ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకి ఆ సినిమా నుండి సినిమాకి సంబంధించిన ఒక్క పోస్టర్ కూడా రివీల్ చేయలేదు. అటు ఎన్టీఆర్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమాలో తమ అభిమాన హిరో లుక్ ఎలా ఉంటుందోనని ఎంతగానో ఎదురు చుస్తున్నారు. చివరికి లుక్ కూడా రిలీజ్ చేయకపోవడంతో అభిమానులే రాజమౌళి చెప్పిన ప్రకారం ఊహించేసుకుని సోషల్ మీడియాలో పోస్టర్లు పెట్టేస్తున్నారు.

 

 

సొషల్ మీడియాలో కనిపిస్తున్న పోస్టర్లేవి అఫీషియల్ గా రిలీజ్ చేసినవి కావు. అయితే కొత్త సంవత్సరం కానుకగానైనా సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఇస్తారని భావించిన అభిమానులకి నిరాశే మిగిలింది. అయితే సినిమా నుండి ఎలాంటి అప్డేట్స్ రాకపోయినా అభిమానుల్లో అంచనాలు మాత్రం తగ్గట్లేదు.  ఇప్పటికే ఎనభై శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఈ సంవత్సరం జులై 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకి సిద్ధం అవుతోంది.

 

 

ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కి జోడీగా బ్రిటన్ భామ అయిన ఒలివియా మోరిస్ ని తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఒలివియా మోరిస్ షూట్ లో పాల్గొనలేదట. ఈ సంవత్సరం ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఈ భామ ఆర్.ఆర్.ఆర్ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లు తెలిపింది.

 

 

ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఒలివియాని అనౌన్స్ చేసినప్పటి నుండి ఆమె ట్విట్టర్ ఫాలోవర్లు విపరీతంగా పెరిగారు. అలా పెరిగిన వారిలో ఎక్కువ శాతం మంది ఇండియాకి చెందినవారే. ఆర్.ఆర్.ఆర్ మీద ఉన్న ఆసక్తితో అప్డేట్ల కోసం ఆమె ఫాలోవర్లు పెరిగారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: