ప్రేమలు కాస్తా పెళ్లిళ్లుగా మారటం లాంటివి బాలీవుడ్ లో హీరో హీరోయిన్స్ కి కొత్తేం కాదు. టాలీవుడ్ తో పోలిస్తే.. బాలీవుడ్ లో ఎఫైర్లు.. డేటింగ్ లు.. విడిపోవటాలు అన్ని చాలా ఎక్కువే. ఎప్పుడు ఎవరితో జత కడతారో.. ఎవరితో బ్రేకప్ చెబుతారో? చెప్పటం బాగా కాస్త కష్టమే. ఊహకు అందని కాంబినేషన్లు కూడా రీల్ లోనే కాదు రియల్ గా కూడా బాలీవుడ్ లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఒక పాపులర్ హీరో వయసులో తనకంటే దాదాపు పన్నెండేళ్లు పెద్దదైన హీరోయిన్ తో డేటింగ్ చేయటం.. త్వరలో అది పెళ్లి వరకూ వెళ్లే అవకాశం ఉండటం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళకి ఎలా ఉందో గాని ఇది వింటున్న సామాన్యులకు మాత్రం ఛండాలంగా షాకింగ్ ఆ ఉంది.

 

హాట్ టాపిక్ గా మాత్రమే కాదు.. ఇప్పటికే చాలాసార్లు నెటిజన్లు కూడా ట్రోల్ చేసిన జంటగా బాలీవుడ్ నటీనటులు అర్జున్ కపూర్.. మలైకా అరోరా జోడీ. దాదాపు పందొమ్మిదేళ్ల వివాహ బంధాన్ని విడాకులతో తీసుకున్న మలైకా ప్రస్తుతం అర్జున్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని చెప్పాలి. నిజానికి మలైకా వివాహబంధం బ్రేకప్ వరకూ వెళ్లటానికి కారణం అర్జున్ కపూర్ అన్న మాటను కూడా బాలీవుడ్ లో కొందరు చెబుతుంటారు. అతగాడి వల్లే మలైకా తన భర్తతో విడాకులు తీసుకుందని బాగా చెప్పుకుంటున్నారు.

 

మలైకా-అర్జున్ కపూర్ జంటకు సంబంధించిన ఏదో ఒక వార్త తరచూ వైరల్ గా మారుతూ ఉంటుంది. న్యూఇయర్ రోజు.. అర్జున్ కపూర్ కు ముద్దిచ్చిన ఫోటోను మలైకా పోస్ట్ చేసిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమ ప్రేమాయణం మీద ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటి ఇవ్వని ఈ జంట.. తాజాగా ఘాటైన ఫోటోను విడుదల చేయటం ద్వారా.. తమ ప్రేమ రానున్న రోజుల్లో పెళ్లి పీటలకు ఎక్కేస్తుందన్న విషయాన్ని మలైకా చెప్పకనే చెప్పేసిందని చెప్పాలి.

 

సీనియర్ నటి మలైకా 1998లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను పెళ్ళి చేసుకుంది. తర్వాత వీరిద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు. తర్వాత మలైకా అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తుంటే.. అర్బాజ్ మాత్రం జార్జియా మోడల్ ఆండ్రియానితో డేటింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. తనకంటే ఎంతో పెద్దదైన మలైకతో పీకల్లోతు ప్రేమలో మునిగిన అర్జున్ త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోవటం ఖాయమంటున్నారు. మరి ఇది రేపు రేపు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చెప్పలేము. 

మరింత సమాచారం తెలుసుకోండి: