భారతీయ చలన చిత్ర రంగంలో సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఆయన నడక, నటన, సిగరెట్ తో చేసే విన్యాసాలు ఒక్కటేమిటి రజినీకాంత్ ప్రతి ఒక్కటీ సూపర్ స్పెషల్ గా ఉంటాయి..స్టైల్ గా కనిపిస్తాయి.  అందుకే ఆయనను యావత్ భారతీయులే కాదు.. ఇతర దేశాల్లో కూడా ఎంతో ఇష్టడే పడే వారు ఉన్నారు.  రజినీకాంత్ మూవీస్ హిట్టూ.. ఫ్లాపు అనే తేడా ఉండదు.  ఏ సినిమా అయినా ఆయన పేరుపైనే మినిమం గ్యారెంటీ గా ఆడుతుంటాయి. ఇటీవల రజినీ నటించిన కబాలి, కాలా మూవీ యావరేజ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లు నాట్ బ్యాడ్ అనిపించుకున్నాయి.  గత ఏడాది పెటా సినిమాతో మంచి కలెక్షన్లు సాధిచారు. తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్భార్’ మూవీలో నటిస్తున్నారు రజినీకాంత్.  

 

అయితే రజినీకాంత్ చాలా ఏళ్ల తర్వాత ఓ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. ఇప్పటికే కబాలి, కాలా, పెట్టా లాంటి సినిమాల్లో మాఫియా తరహా పాత్రల్లో కనిపించి రజినీ చాలా కాలం తర్వాత పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. తాజాగా దర్భార్ మూవీ వినూత్న ప్రచారం చేస్తున్నారు. సాధారణంగా రజినీకాంత్ సినిమా వస్తుందంటే చాలు తమిళ నాట ప్రత్యేకత ఎంతో ఉంటుంది.  ఆయన ఫ్యాన్స్ నెల రోజుల ముందు నుంచి హంగామా చేస్తుంటారు. ర‌జనీకాంత్ తాజాగా మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ద‌ర్భార్ అనే సినిమా చేశారు.

 

జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానున్న ఈ చిత్రం రేపు సాయంత్రం శిల్పక‌ళా వేదిక‌లో ప్రీ రిలీజ్ వేడుక జ‌రుపుకోనుంది.  రిలీజ్ కానున్న నేప‌థ్యంలో సినిమాకి భారీ ఎత్తున ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేస్తుంది లైకా నిర్మాణ సంస్థ‌.  కొన్నాళ్ళుగా రజ‌నీకాంత్ సినిమాల‌కి సంబంధించిన పోస్ట‌ర్స్ బ‌స్సులు, రైళ్ళే కాదు ఏకంగా ఫ్లైట్ల‌పై కూడా ద‌ర్శ‌నం ఇస్తున్నాయి. తాజాగా దర్భార్ పోస్టర్లు విమానాలపై దర్శనం ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆనందం మాటల్లో చెప్పలేనంతగా ఉందంటున్నారు.  అప్పట్లో కబాలి పోస్టర్లు కూడా ఇలాగే విమానాలపై ప్రదర్శించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: