అమెరికాలో ముద్దులు హద్దులు దాటడం షరా మాములే. కానీ మన దేశ హీరోయిన్లు అక్కడికి వెళ్లి అందరి ముందే ముద్దులాటను ప్రదర్శిస్తే అది మనకి కొంచెం సిగ్గుచేటేనని చెప్పుకోవచ్చు. ఈమె ఉందే.. మన దేశంలో పుట్టి, పెరిగి అమెరికన్ ను పెళ్లి చేసుకుంది. సరే, చేసుకోవచ్చనుకో.. కానీ తన కంటే దాదాపు 10ఏళ్ల చిన్నోడిని చేసుకుంది. దీంతో, ఇదేం విడ్డూరం, రా బాబు! అని ఆమెను విమర్శించినవారు కోకోల్లరే ఉన్నారనుకోండి.


కానీ అవన్నీ పట్టించుకోదు ఈమె, ఎందుకంటే జీవితంలో గొప్ప హోదా సంపాదించడం కోసం ఆమె ఏదైనా చేస్తుందని టాక్. లైవ్ షోలోనే వైన్ తాగడం, పొట్టి గుడ్డ ముక్కలు తొడుక్కొని స్కిన్ మొత్తం చూపించడం లాంటివి ఆమె తరచూ చేస్తూ విమర్శలను ఎదుర్కొంటూనే ఉంది. ఇది చాలదన్నట్లు తాజాగా మళ్ళీ ఇంకొక సిగ్గుమాలిన పని చేసి నెటిజెన్ల ఆగ్రహానికి కారణమవుతుంది.


అదేంటంటే.. నిన్న న్యూ ఇయర్ పార్టీ అనంతరం హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ తన తమ్ముడి జోయి జోనస్ తో కలిసి ఒక మ్యూజిక్ కన్సర్ట్ ను నిర్వహించాడు. నిక్ జోనస్ నిర్వహించే అన్ని మ్యూజిక్ ప్రదర్శనలకు వచ్చే ప్రియాంక ఈ కన్సర్ట్ కు కూడా హాజరైంది. ప్రోగ్రామ్ ముగించేముందు నిక్ తన భార్యయిన ప్రియాంకాను స్టేజి పైకి పిలిచాడు. ఆమె రాగానే హత్తుకొని ముద్దలాటను ప్రారంభించాడు నిక్. ఆమె కూడా బహిరంగంగానే నిక్ తో మళ్ళీ ముద్దలతో ముంచెత్తింది. ఇదంతా చదవడానికే ఇబ్బందిగా ఉంది కదూ..! కానీ ఇదే జరిగింది నిన్నటి ప్రోగ్రామ్ లో. ఇక్కడ అంతర్జాతీయ యాక్టర్ గా మన ప్రియాంక ఎదిగిందని గర్వించాలో లేక ఆమె మన సంప్రదాయాలను మంటగలిపి భారతదేశానికి చెడ్డపేరుని తెస్తుందని సిగ్గుపడాలో తెలియడంలేదని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: