ప్రస్తుతం బాలీవుడ్ లో అతి రొమాంటిక్ కపుల్ అనగానే అందరికి క్షణం ఆలోచించకుండా వెంటనే గుర్తుకు వచ్చే జంట రణ్ వీర్ సింగ్-దీపిక పదుకుణె. ఈ ఇద్దరు చాలా కాలం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత వీళ్ళిద్దరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు దీపిక పదుకునే పట్ల రణ్ వీర్ చూపించే శ్రద్ద ఆ ప్రేమ అందరిని ఆశ్చర్యపర్చుతూ అమ్మాయిలు కుళ్లుకునేలా చేస్తుంటాయి. తాజాగా మరోసారి తనలోని రొమాంటిక్ యాంగిల్ ను రణ్ వీర్ కపూర్ చూపించడంతో దీపిక సిగ్గుతో ముడుచుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాకపోతే కాస్త వయసు మళ్ళిన వాళ్ళు మాత్రం ఇది చూసి మరీ అతి చేస్తున్నారు. లోకంలో వీళ్ళేనా ప్రేమించి పెళ్ళి చేసుకుంది ...ఇంకెవరూ లేనట్టు ఇలా బహిరంగంగా అసహ్యంగా బిహేవ్ చేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. వయసు మళ్ళిన వాళ్ళు కాబట్టి వయసులో ఉన్న ఈ జంట ఇవేవీ పట్టించుకోవడం లేదు.

 

అసలిలా ఎందుకు మాట్లాడుతున్నారంటే దీపిక పదుకునే రణ్ వీర్ సింగ్ లు రీసెంట్‌గా ఒక అవార్డు వేడుకలో పాల్గొన్నారు. ఆ సమయంలో వాళ్ళిద్దరు కలిసి స్టేజ్ పైకి వెళ్లారు. స్టేజ్ పై ఉన్న హోస్ట్ వీరిద్దరిని మాట్లాడిస్తున్నాడు. అప్పుడే మీరు ఉదయం బెడ్ మీద నుండి లేచేప్పుడు ఏ సైడ్ లేస్తారు అంటూ కొంటెగా ప్రశ్నించాడు. ఆ కొంటె ప్రశ్నకు కన్ఫ్యూజ్ అయిన దీపిక కాస్త సిగ్గు పడుతూ కుడివైపు నుండి దిగుతాను అంటూ సమాధానం చెప్పింది. అతను అడగడమే నీచం అనుకుంటే అసలు దాటేయకుండా సమాధానం ఎలా చెప్పింది దీపిక అయినా ఆ ప్రశ్న ఏంటయ్యా బాబు అని చాలా మంది అనుకున్నారు.  

 

దీపిక సమాధానం చెప్పగానే వెంటనే రణ్ వీర్ సింగ్ దీపక్ చేతిలోని మైక్ లాక్కొని దీపిక చెప్పింది నిజమే. ఆమె ఉదయం కుడి వైపు నుండి దిగుతుంది. ఎడమ వైపు నేను ఉంటాను. నా వైపు నుండి దిగేందుకు ప్రయత్నిస్తే ఆమెను అంత త్వరగా బెడ్ దిగనివ్వను అంటూ సరదాగా అన్నాడు. దాంతో అక్కడున్న వారు అంతా నవ్వగా దీపిక మొహం మాత్రం కాస్త ఎర్రబడింది. ఇక చాలు అన్నట్లు గా టాపిక్ చేంజ్ చేయించింది. మొత్తానికి ఈ స్టార్ కపుల్ బెడ్ రూం విషయాలు ఇలా బయట చెప్పడంతో అది కాస్త వైరల్ అయ్యింది. అంతేకాదు కొంతమంది నెటిజన్స్ అయితే ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. మీది అన్యోన్య దాంపత్యం కావచ్చు ఎవరు కాదన్నారు. అందుకు సంతోషిస్తారు కూడా. కానీ కొద్దిగైనా సిగ్గు పడకుండా వాళ్ళు అడగ్గానే ఇలా బెడ్రూం విషయాలు బయటకు చెప్పడం ఏమాత్రం బాలేదని చీవాట్లు పెడుతున్నారు. నిజమే కదా మరి ఎంత సెలబ్రిటిస్ అయినా ఇలా బెడ్రూం విషయాలు బయటకు చెప్పరు కదా..! 

మరింత సమాచారం తెలుసుకోండి: