టాలీవుడ్ ఇండస్ట్రీ సీనియర్ హీరోలలో చాలామంది సినిమాలు చేయడంలో చాలా టైం తీసుకుంటున్నారు. కానీ విక్టరీ వెంకటేష్ మాత్రం సీనియర్ హీరోలు మరియు కుర్ర హీరోలతో పోలిస్తే చాలా స్పీడ్ గా సినిమాలు చేస్తూ కెరియర్ ని రాణిస్తున్నారు. వరుసగా 'ఎఫ్ 2' మరియు 'వెంకీ మామ' సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రెండు బంపర్ హిట్లు గత ఏడాది తన ఖాతాలో వేసుకున్న వెంకటేష్. వెంటనే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన 'అసురన్' ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాని గతంలో తనని సూపర్ స్టార్ మహేష్ బాబు ని కలిసి అద్భుతంగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా లో చూపించిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చేయటానికి వెంకటేష్ రెడీ అయ్యారు.

 

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో వెంకటేష్ పక్కన హీరోయిన్ ఎవరు అన్నదానిపై టాలీవుడ్లో ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో అభిమానులలో విపరీతమైన చర్చ నెలకొంది. ముందుగా సినిమాలో హీరోయిన్ శ్రేయ ని తీసుకోవాలని నిర్మాత సురేష్ బాబు డిసైడ్ అయ్యారట. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల శ్రేయ ని వద్దనుకున్నారాటా.

 

ఇటువంటి తరుణంలో విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో బాగా రాణించిన హీరోయిన్ ప్రియమణి నీ తీసుకుంటే బాగుంటుందని కరెక్ట్ గా సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి ప్రియమణి సెట్ అవ్వటం గ్యారెంటీ అని నిర్మాత సురేష్ బాబు కి తెలియజేసినట్లు వార్తలు సోషల్ మీడియాలో రావడంతో దగ్గుబాటి ఫ్యాన్స్ అసలు వెంకటేష్ కి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఎవరు ఇచ్చారు అని ఫుల్ గా సీరియస్ అవుతున్నారు..ఆ హీరోయిన్ తో చేసిన జగపతి బాబు హీరో గా రిటైర్ కూడా అయిపోయాడు అని లక్కీ హ్యాండ్ కాదు అని దగ్గుబాటి ఫాన్స్ ఫీల్ అవుతున్నారట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: