ఒక్క సినిమాతోనే ఓవ‌ర్ నైట్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయం అయిన విజయ్ అర్జున్‌ రెడ్డి సినిమాతో దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించి.. అదే జోరులో గీత గోవిందం సినిమాతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్‌. చాలా తక్కువ కాలంలోనే అగ్ర హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ కేవలం సినిమాలకే పరిమితం కావడం లేదు. వ్యాపారం రంగంలో కూడా దూసుకుపోతున్నాడు. ఇక ఈయ‌న‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫాలోంగ్ ఓ రేంజ్‌లో ఉంది. 

 

అయితే విజ‌య్‌కు కేవ‌లం ఫ్యాన్ ఫాలోంగ్ మాత్ర‌మే కాదు.. పోలిటిక‌ల్ ఫాలోంగ్ కూడా ఉంది. ముఖ్యంగా తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ‌య్‌కు ఎంతో స‌పోర్ట్ చేస్తారు. దీంతో అక్క‌డ విజ‌య్ సినిమాలు రు.10 కోట్లు సులువుగా రాబ‌డుతున్నాయ‌ని టాక్ వినిపిస్తోంది. ఇక ఇటీవ‌ల కేటీఆర్ విజ‌య్ ఇంటికి కూడా వెళ్లారు. అలాగే విజ‌య్ కూడా అర్జున్ రెడ్డి సినిమాకు తొలి ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నాడు. అయితే తనకొచ్చిన అవార్డును సీఎం సహాయనిధికి ఇవ్వాలనుకుంటున్నట్టు విజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక‌ కేటీఆర్ కేవ‌లం ఒక్క విజ‌య్ దేవ‌ర‌కొండ‌కే కాదు.. ఆంధ్రా హీరోల‌తోనూ బాగా స్నేహంగా ఉంటాడు. 

 

అలాగే వాళ్ల సినిమాలు చూసి ట్వీట్లు పెట్టి ప్రోత్స‌హిస్తుంటారు. కాగా, విజ‌య్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ నాలుగు డిఫరెంట్ వేరియేషన్స్‌ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్,ఇజబెల్లా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఫైట‌ర్ అనే సినిమా చేయ‌నున్నాడు విజ‌య్‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: