ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనపై మరింత దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించి పాలనలో తన మార్క్ ఏంటో చూపిస్తున్నారు. ఇప్పటి వరకు నిర్వహిస్తున్న పథకాలు కార్యరూపం ఏమాత్రం దాల్చుతున్నాయో తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా రాబోయే కొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో ఇపుడు దృష్టంతా దానిపైనే ఉంది. ఏ మాత్రం సమయం దొరికినా మున్సిపల్ పోరుపైనే మాట్లాడుతున్నారు. ఎలాగైనా ప్రతిపక్షాలను ఎదుర్కొని అందులో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. 

 

ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎమ్మెల్యే, ఎంపీలకు ఓ దిశానిర్దేశం చేశారు. సినిమాలకు, షికార్లకు వీలైనంత దూరంగా ఉంటే మంచిదని సూచించినట్టు సమాచారం. ఎందుకంటే పాలనపై మరింత దృష్టి సారించాలని చెప్పినట్టు వినికిడి. అంతేకాదు మున్సిపల్ ఎన్నికల బాధ్యతను తాజాగా ఎమ్మెల్యేలపై మోపారు. ఎమ్మెల్యేలు ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఇంకేముంది ఎమ్మెల్యేలు కేసీఆర్ చెప్పినట్టుగానే సినిమాలకు దూరంగా ఉన్నట్టు సమాచారం. ఎన్నికలు పూర్తయి.. విజయం సాధించన తర్వాత సంబరాలు చేసుకోవాలని సూచించారని తెలుస్తోంది. 

 

మొత్తానికి కేసీఆర్ ఇపుడు మున్సిపల్ ఎన్నికలపైనే దృష్టిపెట్టారు. ఈ శనివారం పురపోరులో అనుసరించాల్సిన వ్యూహాలను ప్రజాప్రతినిధులతో పంచుకోనున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏమాత్రం ప్రజలకు దగ్గరగా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా సీఎం చెప్పినట్టు ఫాలో అవుతున్నారు. వీలైనంత త్వరగా ప్రజలకు దగ్గరగా ఉంటూ సినిమాలకు, షికార్లకు దూరంగా ఉంటూ గులాబీ అధినేత దగ్గర మంచి మార్కులు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశం ఇపుడు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కె.చంద్రశేఖర్ రావు వార్నింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో మార్పును తీసుకొచ్చిందని చెవులు కొరుక్కుంటున్నారు. ఇటీవల ఎన్ని సినిమాలు వచ్చినా థియేటర్ల వైపు వారు అసలు రాకపోవడానికి ఇదే కారణమని తెలుగు ఇండస్ట్రీలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: