టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా అలవైకుంఠపురములో సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ అన్ని కూడా మంచి రెస్పాన్స్ సాధించడంతో పాటు యూట్యూబ్ లో దుమ్ము రేపే వ్యూస్, లైక్స్ దక్కించుకున్నాయి. ఎస్ ఎస్ థమన్ అందించిన అద్భుతమైన మ్యూజిక్ కి యువత, మరియు సాధారణ ప్రేక్షకులు విశేషమైన స్పందనను అందించారు. 

 

ఇక ఈ సినిమాలోని సామజవరగమనా, రాములో రాములా సాంగ్స్ రెండూ కూడా 100 మిలియన్ల కు పైగా వ్యూస్ దక్కించుకుని, యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్స్ నెలకొల్పాయి. ఇకపోతే ఎప్పటికప్పుడు తన సినిమా, వ్యక్తిగత విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకునే బన్నీ, నేడు తన కూతురు అర్హ ఫన్నీ వీడియోని తన అకౌంట్ లో పోస్ట్ చేసారు. అలవైకుంఠపురములో పాపులైన రాములో రాములా సాంగ్ ని తన కూతురు అర్హకి వినిపించిన బన్నీ, ఆ సాంగ్ లో స్టెప్స్ ఎలా ఉంటాయి అని ఆమెను అడుగగా, అర్హ ముద్దు ముద్దుగా దోశ వేస్తున్నట్లుగా వేసే స్టెప్స్ ని వీడియో తీసి పోస్ట్ చేసారు. 

 

ఇక ఆయన పోస్ట్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. గతంలో కూడా తన సినిమాల్లోని పలు సాంగ్స్ కు కొడుకు అల్లు అయాన్, కూతరు అర్హ ఇద్దరూ కూడా ఫన్నీగా డాన్స్ లు చేసిన ఘటనలు ఉన్నాయి. ఇక ఇటీవల ఇదే సినిమాలోని ఓ మై గాడ్ డాడీ సాంగ్ కు వీరిద్దరూ సరదాగా చేసిన డాన్స్ వీడియో ఎంతో వైరల్ అయింది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: