రానా దగ్గుబటి..దగ్గుబాటి వారసుడిగా లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మంచి సక్సస్ ని నమోదు చేసుకుంది. ఇక రానా కి నటుడిగా మంచి పేరు వచ్చింది. ఇక రానాని చూసిన అందరు బాలీవుడ్ కటౌట్ అన్నారు. అలానే మధ్య మధ్యలో రానా బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ అందరు అన్న మాట నిజం చేస్తున్నాడు. ఇక రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ప్రాంచైజీలో ప్రభాస్ కి ఎంత పేరు వచ్చిందో రానాకు అంతే పేరు వచ్చింది. ఇక కొన్నాళ్ల కిందట రానాకు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డ సంగతి తెలిసిందే. ఏకంగా అమెరికా వెళ్లి ట్రీట్ మెంట్ కూడా తీసుకున్నాడు. సర్జరీ నుంచి ప్రస్తుతం కోలుకుంటున్నాడు. 

 

ఈమధ్య 2-3 పబ్లిక్ ఫంక్షన్లలో కూడా కనిపించాడు. తాజాగా మత్తువదలరా ప్రమోషన్ కోసం మరోసారి మీడియా ముందుకొచ్చాడు రానా. అలా రానాను చూసిన చాలామంది అవాక్కయ్యారు. మరీ బక్కపల్చగా తయారైనా రానా, ఇంకా కోలుకోలేదంటూ రక రకాలుగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయంలో విషయం పెద్దదై, పుకారుగా మారకముందే క్లారిటీ ఇస్తే బెటర్ అనుకున్నారామో.. కాస్త ముందుగానే మేల్కొంది కాంపౌండ్. రానా ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని, తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెబుతున్నారు. అంతేకాదు, మేకోవర్ లో భాగంగానే రానా అలా స్లిం గా కనిపిస్తున్నాడని చెబుతున్నారు. 

 

'విరాటపర్వం' సినిమాలో నక్సలైట్ గా నటిస్తున్నాడు రానా. నక్సలైట్ పాత్ర అంటే సహజంగానే లుక్ పరంగా సన్నగా తయారవ్వాలి.. అడవుల్లో ఉండే వ్యక్తులు కాబట్టి సన్నగానే ఉండాలి. ఎలాంటి కండలు కనిపించకూడదు.. చూపించకూడదు. అందుకే రానా ఇలా స్లిమ్ లుక్ లోకి మారాడని చెబుతున్నారు రానా సన్నిహితులు. వాళ్లు కవరింగ్ కోసం చెబుతున్నారా, నిజమే చెబుతున్నారా అనే విషయాన్ని పక్కనపెడితే.. విరాటపర్వం సినిమాలో రవన్న అనే నక్సలైట్ పాత్రకు మాత్రం సరిగ్గా సరిపోయే ఫిజిక్ తోనే రానా కనిపిస్తున్నాడు. ఇది మేకోవర్ తప్ప ఆరోగ్య సమస్య కాదని అంటున్నారు. మరి 'విరాటపర్వం' సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత మళ్ళీ ముందులా కాస్త బాడీ షేప్ తయారవుతుందేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: